Milk For Skin: మీ చర్మం కాంతివంతంగా , మచ్చ లేకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఖరీదైన ఉత్పత్తులు , చికిత్సల తర్వాత కూడా మీ చర్మంపై మీరు అనుకున్న మెరుపును పొందలేకపోతున్నారా? అవును అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ మీ చర్మాన్ని సహజంగా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మచ్చలను కూడా తగ్గిస్తుంది. మీ వంటగదిలో ఉండే పదార్థాలను పాలల్లో వేసి మీ చర్మాన్ని అద్దంలా మెరిసేలా చేసుకోవచ్చు. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం పాలను ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1) పాలు, తేనె:
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. పాలు, తేనె మిశ్రమం చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది మొటిమలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఒక టీస్పూన్ పాలలో అర టీస్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
2) పాలు, పసుపు:
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మపైమంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా మొటిమలతో కూడా పోరాడుతాయి. పాలు, పసుపు పేస్ట్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఒక చెంచా పాలలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ కావాలని అనుకునే వారు తరుచుగా ఇలా చేయడం వల్ల అధ్భుత ప్రయోజనాలు ఉంటాయి.
3) పాలు,శనగపిండి:
శనగపిండి సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఫలితంగా చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. పాలు, శనగపిండి పేస్ట్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
రెండు చెంచాల శనగపిండిని కొంచెం పాలతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
4) పాలు, పెరుగు:
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు పోషణను అందిస్తుంది. పాలు ,పెరుగులతో తయారు చేసిన మిశ్రమం చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఒక చెంచా పాలలో ఒక చెంచా పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి.
5) పాలు, ఓట్స్ :
ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అంతే కాకుండా పాలు, ఓట్స్ తో తయారు చేసిన పేస్ట్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా మృదువుగా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఒక చెంచా ఓట్స్‌ను పాలలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Also Read: ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు క్షణాల్లోనే మాయం
ఈ విషయాల పట్ల జాగ్రత్త:
ఈ ప్యాక్‌లను ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీకు ఏదైనా పదార్ధానికి అలెర్జీ ఉంటే దానిని ఉపయోగించకండి.
ఈ ప్యాక్‌లను వారానికి 2-3 సార్లు అప్లై చేయవచ్చు.
ఈ ప్యాక్‌లను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది