Bachchala Malli Collections: డిసెంబర్ 20న ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క భాష. కానీ కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అలాగే ఈవారం ఒక తెలుగు చిత్రం కూడా విడుదలయ్యింది. అదే అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘బచ్చల మల్లి’. ఈ సినిమాను మినిమమ్ బడ్జెట్‌తోనే తెరకెక్కించినా.. దీనికి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించేలా అనిపించడం లేదని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ‘బచ్చల మల్లి’తో నరేశ్ (Allari Naresh) ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడా లేదా? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?
హిట్ రావట్లేదు
సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో అల్లరి నరేశ్ నటించిన సినిమానే ‘బచ్చల మల్లి’. గత కొన్నేళ్లుగా అల్లరి నరేశ్ కూడా తన కంఫర్ట్ జోనర్ అయిన కామెడీ నుండి బయటికి వచ్చి కొత్తగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. అలాంటి ప్రయోగాల్లో ‘నాంది’ సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. మళ్లీ అలాంటి హిట్ కోసమే అప్పటినుండి ఎదురుచూస్తున్నాడు అల్లరి నరేశ్. అలాగే వివిధ రకాల పాత్రలు చేస్తూ ఉన్నా అలాంటి హిట్ మాత్రం అల్లరోడికి పడడం లేదు. అయినా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. మొదటిసారి పూర్తిగా మాస్ లుక్‌తో ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘బచ్చల మల్లి’.
Also Read: బచ్చల మల్లీ మూవీ రివ్యూ
బ్రేక్ ఈవెన్ సాధ్యమా.?
‘బచ్చల మల్లి’ (Bachchala Malli) మూవీ రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమాకు ఇంకా రూ.5 కోట్లు రావాలి. ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1 కోటి కావాలి. కానీ ‘బచ్చల మల్లి’ మొదటి రోజు రూ.60 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. దీన్ని బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రెండు వారాలు అయినా ఈ సినిమా థియేటర్లలో రన్ అవ్వాలి. ఈ మూవీతో పాటు మరో మూడు సినిమాలు ఒకేసారి పోటీకి దిగాయి. ‘బచ్చల మల్లి’తో పోలిస్తే ప్రేక్షకులు ఎక్కువగా ఇతర సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే బుకింగ్స్ విషయంలో, కలెక్షన్స్ విషయంలో ఈ అల్లరోడి సినిమా వెనకబడింది. ఇలాగే కొనసాగితే ఈ సినిమా కూడా డిశాస్టర్ లిస్ట్‌లోకి యాడ్ అవ్వక తప్పదు.
పట్టించుకోవడం లేదు
‘నాంది’ తర్వాత ఒక్క హిట్ వస్తే చాలు అని అల్లరి నరేశ్ చాలానే కష్టపడుతున్నాడు. అలాగే ‘బచ్చల మల్లి’తో కూడా ప్రయోగం చేశాడు. తన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది కూడా ఒకటి అవుతుందని అల్లరోడు నమ్మకం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ఒక మూర్ఖుడి బయోపిక్ అనే ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయాలని చూశారు మేకర్స్. కానీ ప్రేక్షకులు మాత్రం ‘బచ్చల మల్లి’ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రోజురోజుకీ కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ తప్పా నష్టాల్లోకి వెళ్లకుండా ఆగదు.