Mulberry Benefits : మల్బరీ అధిక పోషకాలు కలిగిన పండు. చర్మానికి ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సి , ఎ, ఖనిజాలు చర్మాన్ని లోపలి నుండి ప్రకాశవంతం చేస్తాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి.
మల్బరీని నేరుగా కూడా తినవచ్చు. లేదా ముఖంపై అప్లై చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మల్బరీ రసం లేదా పేస్ట్ ను చర్మంపై అప్లై చేయడం ద్వారా మీరు దాని యొక్క అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమల నుండి ఉపశమనం:
మల్బరీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మొటిమల సమస్యను తొలగించడంలో సహాయపడతాయి.
నల్లటి మచ్చలు:
మల్బరీలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా నల్లటి మచ్చలను తేలిక పరచడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఏకరీతిగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
ముడతలను తగ్గించడం:
మల్బరీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడతాయి. ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా ఉండాలంటే మల్బరీ తినడం మంచిది. అంతే కాకుండా ఇది గ్గోయింగ్ స్కిన్ కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది:
మల్బరీలో అధికంగా నీటి శాతం ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా తేమను అందిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతుంది. ముఖం కాంతివంతంగా ఉండాలంటే మల్బరీ తినడం చాలా మంచిది.
ప్రయోజనాలు:
తెల్ల మల్బరీలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది.
మల్బరీ పండ్లలో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మల్బరీలో అధిక మొత్తంలో ఆహార ఫైబర్ , లినోలెయిక్ ఆమ్లం ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.
మల్బరీలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు, వారిపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఇందులో జింక్ , మాంగనీస్ మంచి పరిమాణంలో లభిస్తాయి. వీటిలో జింక్ ప్రధానంగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
మల్బరీలో సైనైడింగ్ 3-గ్లూకోసైడ్ అనే ఫైటోన్యూట్రియెంట్ కనిపిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
మల్బరీకి యాంటీ-హీమోలిటిక్ (హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే) ప్రభావం ఉంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించగలదు.
Also Read: ప్రియాంక చోప్రా.. గ్లోయింగ్ స్కిన్ రహస్యం ఇదే !
మల్బరీలో హైపర్గ్లైసీమిక్ ప్రభావం కనిపిస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ కార్యకలాపాలను పెంచుతుంది . అంతే కాకుండా రక్తంలో అదనపు చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇది సైటోప్రొటెక్టివ్ (కణాల నష్టం నుండి రక్షించడం) , న్యూరోప్రొటెక్టివ్ (నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గించడం) ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా మొదడు పనితీరును మెరుగుపరుస్తుంది.