BigTV English

Bird Flue in Telangana : తెలంగాణలో బర్డ్ ప్లూ అలర్డ్ – ఆ జిల్లాల్లో లక్షల కోళ్లు మృత్యువాత

Bird Flue in Telangana : తెలంగాణలో బర్డ్ ప్లూ అలర్డ్ – ఆ జిల్లాల్లో లక్షల కోళ్లు మృత్యువాత

Bird Flue in Telangana : గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తున్న బర్డ్ ప్లూ.. ఇప్పుడు సంగారెడ్డి, మెదక్ సిద్దిపేట జిల్లాల్లో పాకుతుందనే టెన్షన్ మొదలైంది. ఈ రెండు జిల్లాల్లోని వేల ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి. అప్పటి వరకు కోళ్లతో కిటకిటలాడుతున్న పౌల్ట్రీ ఫారాలు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీంతో.. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పౌల్ట్రీ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. బర్డ్ ఫ్లూ లేదని ఓ వైపు వెటర్నరీ అధికారులు చెబుతున్నా.. మరోవైపు ఫారం కోళ్లు మాత్రం విపరీతంగా మృత్యువాత పడుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వేలాది కోళ్లు చనిపోతుండడం.. అటు పౌల్ట్రీ వ్యాపారులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.


సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పౌల్ట్రీఫారాల్లో చోటుచేసుకుంటున్న కోళ్ల మరణాలపై వార్తలు రావడంతో చికెన్ ప్రియులు కోళ్లను కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మరణిస్తుండగా.. పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించడంతోనే సరిపెడుతున్నారు తప్పా.. ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై రెండు జిల్లాల్లోని కోళ్ల ఫారం నిర్వహకులతో పాటుగా వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్, చౌటకూర్ మండలాల్లో కేవలం మూడు రోజుల వ్యవధిలో 20 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. చౌటకూర్ మండలం తాడ్ దాన్ పల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారంలో మూడు రోజుల్లో 9 వేల కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లను ఫారం నిర్వహకులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి భూమిలో పాతిపెట్టారు. వెటర్నరీ అధికారులు ఫారాన్ని పరిశీలించి పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించినప్పటికీ.. కోళ్లు ఎలా చనిపోయాయని నిర్ధారణ కాలేదు. అలాగే చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం గిరిజన తండాలో రెండు రోజుల వ్యవధిలో 7 వేల కోళ్లు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడే కాదు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్లఫారాలలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది.


మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలోని కోళ్ల ఫారంలో 9 వేల కోళ్లు మృతి చెందాయి. మూడు రోజుల కింద కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ లోని ఓ పౌల్ట్రీ ఫారంలో 2 వేల కోళ్లు చని పోయాయి. చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో.. శనివారం వేలాది కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ రైతులు గుంతలు తీసి వాటిని పూడ్చిపెట్టారు. శివంపేట మండలం గూడూరు తండాలోను వందలాది కోళ్లు మృత్యువాత పడటంతో జేసిబీతో గుంత తీసి పాతి పెట్టారు. వరుసగా కోళ్లు మృత్యువాత పడుతుండడంతో జిల్లాలో అక్కడక్కడ పౌల్ట్రీ ఫారాలు మూతపడుతు న్నాయి. చౌటకూర్ మండలం తాడ్ దాన్ పల్లి గ్రామ శివారులో కోళ్ల ఫారానికి తాళాలు వేసి నిర్వాహ కులు వెళ్లిపోయారు. కోళ్లు చనిపోవడంతో ఆర్థికంగా నిలదొక్కుకోలేక పౌల్ట్రీఫారాన్ని వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల కూడా అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృతి చెందడం వల్ల వ్యాపారస్తులు కొంతకాలం పాటు పౌల్ట్రీ బిజినెస్ ని మానుకుంటున్నారు.

Also Read : CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌కు పురుడు పోసిన ఆ మహోన్నత వ్యక్తిని KCR కనీసం..?: సీఎం రేవంత్ రెడ్డి

చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ని సేకరించిన పశు వైద్యాధికారులు ల్యాబ్ కి పంపుతున్నారు. కానీ వాటికి బర్డ్ ఫ్లూ వచ్చిందా లేదా అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఇతర రోగాలతో చనిపోయాయా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పౌల్ట్రీ రైతులకు బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించి కోళ్ల పెంపకంపై మరిన్ని సూచనలు ఇస్తే ఈ కోళ్ల మృత్యువాతకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.లేదంటే పోల్ట్రీ రంగం నష్టాలలో కురుపోతుంది.

Related News

Heavy Rains: రాష్ట్రంలో మళ్లీ కుండపోత వానలు.. రెండ్రోజులు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, భారీ పిడుగులు..?

Harish Rao: తెలంగాణ బీజేపీ ఎంపీలకు హరీష్ రావు సవాల్.. ఆ విషయంలో కేంద్రాన్ని అడిగే దమ్ముందా..?

Telangana Jagruthi: కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు

Hyderabad Real Estate: MSN రియాల్టీ సంస్థ సరికొత్త రికార్డ్.. ఎకరా స్థలం రూ.177 కోట్లకు కొనుగోలు

Telangana Pharma Hub: ఫార్మా ఇండస్ట్రీలో మరో మైలురాయి.. హైదరాబాద్ నుంచే ప్రపంచ స్థాయి ఔషదాల తయారీ

Election Code: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

BC Reservations: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

Big Stories

×