BigTV English

Appudo Ippudo Eppudo In OTT : సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ మూవీ ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Appudo Ippudo Eppudo In OTT : సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ మూవీ ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Appudo Ippudo Eppudo In OTT : థియేటర్లలోకి వస్తున్న సినిమాలు అక్కడ యావరేజ్ టాక్ ను అందుకుంటే మాత్రం కొద్దిరోజుల్లోనే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. కొన్ని సినిమాలు ముందుగానే అప్డేట్ ఇచ్చి వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం సడెన్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.  అక్కడ హిట్ టాక్ ను అందుకొని సినిమాలు ఇక్కడ పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా భారీ వ్యూస్ ను రాబడుతున్నారు. తాజాగా మరో కొత్త మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఏంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన రీసెంట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు అవ్వకుండానే చెప్పాపెట్టకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం.. అసలు ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా చాలమందికి తెలియదు. కానీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నిఖిల్ అకౌంట్ లో కార్తికేయ సినిమా తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను ఒక్క సినిమా కూడా అందుకోలేదు. ‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ దానికి తగ్గ సినిమాలు చేయట్లేదు. ‘స్పై’ అనే మూవీ చేశాడు. ఇది ఫ్లాప్ అయింది. ఇటీవల వచ్చిన కొత్త మూవీ కూడా అంతే అలాంటి టాక్ ను సొంతం చేసుకుంది. అసలు ఈ మూవీని ఎప్పుడు తెరకేక్కించారో కూడా చాలా మందికి తెలియదు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చెయ్యలేదు అందుకే సినిమా జనాలకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

ఇక అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ స్టోరీ విషయానికొస్తే.. నిఖిల్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి దూరం అయ్యిందని లండన్ వెళ్ళిపోతాడు. ఇక అక్కడ తులసి ని ఓ ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఆమెకు దగ్గరై పెళ్లి వరకు వెళ్తాడు. సరిగ్గా పెళ్లి టైంకి ఆమె హ్యాండిస్తుంది. ఈ లోగా బద్రి అనే డాన్.. వందలాది కోట్లు ఓ అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే డివైజ్ పోగొట్టుకుంటాడు. అది రిషి దగ్గర ఉందని అతనికి అనుమానమోస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథ.. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సమయంలోనే ఇండియాలో ప్రేమించిన అమ్మాయి అక్కడకు వస్తుంది. ఆమె ప్రేమను పొందుతాడా అన్నది సినిమాలో చూడాలి..


ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. స్వయంబు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో పాటుగా కార్తికేయ 3 సినిమాలో చెయ్యనున్నాడని టాక్ దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం..

Tags

Related News

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంటర్వ్యూకు వచ్చిన 8 మంది ఒకే గదిలో… అమ్మాయి బట్టలు విప్పుతూ… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : అడుగు పెట్టగానే కుప్పకూలే కలల సౌధం… చివరి వరకూ ట్విస్టులే… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×