BigTV English

Multani Mitti: ముల్తానీ మిట్టిని ఇలా వాడారంటే.. అమ్మాయిలే అసూయపడే అందం

Multani Mitti: ముల్తానీ మిట్టిని ఇలా వాడారంటే.. అమ్మాయిలే అసూయపడే అందం

Multani Mitti: ముల్తానీ మట్టి చర్మ సౌందర్యానికి చలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి మృదువుగా , ప్రకాశవంతంగా మారుస్తుంది. కొన్ని రకాల పదార్ధాలతో కలిపి తయారు చేసిన ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్ ముఖానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమల, మచ్చలు రాకుండా చేస్తుంది. మీ చర్మాన్ని మెరిసేలా, తాజాగా కనిపించేలా చేయడానికి ఉపయోగపడే ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్‌ల తయారీ, ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ తో ఫేస్ ప్యాక్:
మీ చర్మం జిడ్డుగా ఉండి, తరచుగా చెమటలు పడుతుంటే ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్ ప్యాక్ మీకు ఉత్తమమైనది. రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరుస్తుంది. అలాగే హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముల్తానీ మట్టి అదనపు నూనెను పీల్చుకోవడం ద్వారా ముఖాన్ని శుభ్రపరుస్తుంది.

ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక చెంచా ముల్తానీ మిట్టిలో తగినంత రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసి ముఖం మొత్తానికి అప్లై చేయండి. ఆరిగన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేసి ముఖం తాజాగా, మృదువుగా కనిపించేలా చేస్తుంది.


2. ముల్తానీ మిట్టి, పసుపు:
మీ ముఖం మీద మొటిమలు, నల్లటి మచ్చలు ఉంటే పసుపు, ముల్తానీ మిట్టి ప్యాక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. అంతే కాకుండా చర్మ రంగును మెరుగుపరుస్తాయి. దీనిని తయారు చేయడానికి ఒక చెంచా ముల్తానీ మట్టిలో అర చెంచా పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ లేదా పెరుగు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మొటిమలను తగ్గించి చర్మానికి మెరుపును ఇస్తుంది.

3. ముల్తానీ మట్టి, పచ్చి పాలు:
ముల్తానీ మట్టి, పచ్చి పాలు పొడిబారిన , నిర్జీవ చర్మానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా తేమగా చేస్తుంది. వీటితో ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం ఒక చెంచా ముల్తానీ మిట్టిని రెండు చెంచాల పచ్చి పాలతో కలిపి ముఖంపై 15-20 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత వాష్ చేయండి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. నీరసాన్ని తొలగిస్తుంది. ఫలితంగా ముఖం సహజంగా మెరుస్తుంది.

Also Read: తెల్లజుట్టు నల్లగా మార్చడానికి.. వీటిని మించినది లేదు !

4. ముల్తానీ మిట్టి, అలోవెరా:
మీ చర్మం సున్నితంగా ఉండి, ఎరుపు లేదా చికాకు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే ముల్తానీ మిట్టి , కలబంద జెల్ ప్యాక్ ఉత్తమంగా ఉంటుంది. కలబంద చర్మాన్ని రిపేర్ చేస్తుంది ,టానింగ్ తగ్గిస్తుంది. దీని కోసం ఒక చెంచా ముల్తానీ మిట్టిలో ఒక చెంచా కలబంద జెల్ కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని తేమగా చేస్తుంది. ఇది ఆరోగ్యంగా మెరిసేలా తయారు చేస్తుంది.

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×