BigTV English

US President Elon Musk : అమెరికా ప్రెసిడెంట్‌గా మస్క్.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఆయన చేతుల్లోనే

US President Elon Musk : అమెరికా ప్రెసిడెంట్‌గా మస్క్.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు ఆయన చేతుల్లోనే

US President Elon Musk Time Magazine | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ను అమెరికా అధ్యక్షుడిగా పేర్కొంటూ టైమ్ మ్యాగజైన్ (Time magazine) ఒక కవర్ పేజీని ప్రచురించింది. ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడి స్థానంలో మస్క్ కాఫీ కప్ చేత పట్టుకొని ఠీవిగా కూర్చుని ఉన్నట్లు మస్క్ కనిపిస్తున్నారు. ఈ కవర్ పేజీలో “ఇన్సైడ్ ఎలోన్ మస్క్ వార్ ఆన్ వాషింగ్టన్” అనే శీర్షికతో ఒక కథనం కూడా ప్రచురించబడింది. ఈ కథనంలో, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మస్క్ చేసిన కృషి, డోజె విభాగం ద్వారా ప్రభుత్వానికి అందించిన సహకారాన్ని వివరించారు.


అయితే టైమ్స్ పత్రికపై ఎలాన్ మస్క్ ప్రెసిడెంట్‌గా ప్రచురించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. “టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తోందా? ఆ మ్యాగజైన్ ఇప్పటికీ ఉన్న విషయమే నాకు తెలియదు” అని వెటకారంగా మాట్లాడారు.

ఈ కథనాన్ని రాసిన సైమన్ షుస్టర్, బ్రియాన్ బెన్నెట్ అనే రచయితలు మాట్లాడుతూ.. దేశంలోని మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు మస్క్ దయపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యంలో ఉన్న అమెరికా.. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ డోజె విభాగాన్ని సృష్టించారు. అమెరికాలో అనవసర ఖర్చులను తగ్గించేందుకు భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపును ఈ విభాగమే చూస్తోంది. అయితే విభాగానికి నేతృత్వం వహిస్తున్న మస్క్.. ట్రంప్‌నకు మాత్రమే జవాబుదారీగా వ్యవహరిస్తున్నారని, తన అజెండాకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు వివరించారు. ఈ నేపథ్యంలోనే యూఎస్ఎయిడ్ (USAID)ను మూసివేసినట్లు కూడా పేర్కొన్నారు. మస్క్ డోజె గురించి వారు వైట్ హౌస్ కు పంపిన అనేక ప్రశ్నలకు ఎటువంటి సమాధానం రాలేదని కూడా తెలిపారు.


Also Read: ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరాన్.. భారీ బాంబు దాడులకు ప్లాన్

టైమ్ మ్యాగజైన్ మస్క్ ను కవర్ పేజీలో ప్రచురించడం ఇది రెండోసారి. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు కీలకపాత్ర పోషించినందుకు మస్క్ ను ‘కింగ్ మేకర్’గా పేర్కొన్నారు. ‘సిటిజన్ మస్క్: ఆయన చేయవలసిన జాబితాలో తరువాత ఏంటి?’ అనే శీర్షికతో కవర్ పేజీని ప్రచురించారు. మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ట్రంప్ ను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది టైమ్ మ్యాగజైన్. 2024లో కూడా వార్తల్లో ట్రంప్ నిలిచారని ఆ పత్రిక పేర్కొంది.

ట్రంప్ అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత, ప్రభుత్వ విషయాల్లో మస్క్ జోక్యం చేసుకోవడంపై డెమోక్రాట్లు ‘ప్రెసిడెంట్ మస్క్’ అని విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ మాట్లాడుతూ, మస్క్ అమెరికాలో జన్మించలేదు కాబట్టి ఆయన ఎప్పటికీ దేశాధ్యక్షుడు కాలేరని స్పష్టం చేశారు. తన ఆదేశాలకు అనుగుణంగానే ఎలాన్ పని చేస్తున్నారని కూడా అన్నారు.

టిక్‌టాక్ కొనుగోలుపై మస్క్ స్పందన
అమెరికాలో ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok)పై నిషేధం ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. దీని నుంచి తప్పించుకునేందుకు ట్రంప్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ కు విక్రయించాలని ప్రచారం జరుగుతోంది. మస్క్ దీనిపై స్పందించారు. తనకు టిక్‌టాక్ ను కొనుగోలు చేయాలనే ఆలోచన అసలు లేదని స్పష్టం చేశారు. గత నెలలో ఒక వీడియోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించగా, జర్మనీకి చెందిన ఒక వార్తా సంస్థ తాజాగా ఈ సమాచారాన్ని బయటపెట్టింది. టిక్ టాక్ షాడ్ వీడియో యాప్ ని అమెరికాలోని సగం జనాభా ఉపయోగిస్తున్నారు. అయినా ఎలాన్ మస్క్ దీని కొనుగోలుపై ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం.

“నేను టిక్‌టాక్ కోసం బిడ్డింగ్ వేయలేదు. దాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ కొన్నా ఏం చేయాలనేదానిపై ఎలాంటి ప్రణాళికలు లేవు. నాకు కంపెనీలు కొనడం ఇష్టం ఉండదు.. నెలకొల్పడం అంటేనే ఇష్టం” అని మస్క్ పేర్కొన్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×