Ind Vs Eng 2nd Odi: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… 3 వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండవ వన్డే జరగనుంది. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ వన్డే కటక్ లోని భారామతి స్టేడియంలో జరుగుతోంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్క్ ప్రక్రియ కాసేపటికి… ముగిసింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ టీం.. మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంగ్లండ్ టీం కెప్టెన్ జోస్ బట్లర్ ప్రకటన చేశారు.
Also Read: Rashid Khan: టీ-20ల్లో రషీద్ ఖాన్ గోల్డెడ్ లెగ్.. 5 టోర్నమెంట్లు వచ్చేశాయి ?
ఇక టాస్ నెగ్గిన ఇంగ్లండ్ టీం.. మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో… టీమిండియా బౌలింగ్ చేయనుంది. మొదటి వన్డే మ్యాచ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగా… ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. టీమిండియా మిస్టరీ స్పిన్నర్… వరుణ్ చక్రవర్తిని.. ఇంగ్లాండ్ తో జరిగే రెండవ వన్డే మ్యాచ్ బరిలోకి దింపింది రోహిత్ సేన. కుల్దీప్ యాదవ్ స్థానంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్… వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. దీంతో తన అరంగేట్ర వన్డే ఆడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. అటు విరాట్ కోహ్లీ కూడా… రెండవ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ తుది జట్టులోకి వచ్చాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ మొదటి వన్డే మ్యాచ్ లో ఆడలేదన్న సంగతి తెలిసిందే.
మోకాళి గాయం కారణంగా…. మొదటి వన్డే మ్యాచ్ కు దూరం అయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే.. కోహ్లీ రెండో వన్డే ఆడితే.. శ్రేయస్ అయ్యర్ లేదా… యశస్వీ జైస్వాల్ పైన వేటు పడుతుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే… మొదటి వన్డేలో విఫలమైన యశస్వీ జైస్వాల్ పైనే వేటు వేశారు. అదే సమయంలో ఇంగ్లాండ్ లో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా ముగ్గురు కొత్త ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. మొదటి వన్డే ఆడని మార్కువుడ్, గస్ అకిన్సన్, అలాగే జమ్మి ఓవర్ టన్ ముగ్గురు కూడా జట్టులోకి రావడం జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.
Also Read: Rachin Ravindra injury: రచిన్ కు గాయం.. గ్రౌండ్ లో లైట్లే వేయలేదంటూ PCBపై ట్రోలింగ్ ?
ఇరు జట్టు
భారత్ : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, కెఎల్ రాహుల్ (వికె), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్(w), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్