Jack Movie: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారన్నది తెలిసిన విషయమే. అందులో లేటెస్ట్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య కూడా ఒకరు. యూట్యూబ్‌లోని షార్ట్ ఫిల్మ్స్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వెండితెరపై హీరోయిన్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే కనిపించేది. ఆ తర్వాత తనకు ‘బేబి’ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. అంతే ఆ తర్వాత తనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్‌గా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. త్వరలోనే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘జాక్’తో హీరోయిన్‌గా ఎంటర్‌టైన్ చేయనుంది వైష్ణవి. ఇంతలోనే ఈ సినిమా నుండి ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ బయటపడింది.
కిస్ ప్రోమో
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే ‘జాక్’ (Jack). ‘బేబి’తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)కు, ‘డీజే టిల్లు’ ఫ్రాంచైజ్‌తో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)కు బ్లాక్‌బస్టర్స్ హిట్స్ అందాయి. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి ‘జాక్’పై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇటీవల విడుదలయిన ఈ మూవీ టీజర్ కూడా కాస్త పరవాలేదనిపించింది. కానీ ప్రేక్షకులు సిద్ధు సినిమా నుండి ఏదైతే ఆశిస్తారో అది మిస్ అయ్యిందని చాలామంది ఫీలయ్యారు. ఇంతలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కిస్ అనే సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమో కాసేపట్లోనే తెగ వైరల్ అయ్యింది. ఇదే సమయంలో ‘జాక్’ మూవీలోని ఒక స్పాయిలర్ బయటపడింది.
అలాంటి రోల్
‘జాక్’ మూవీ టీజర్‌లో సిద్ధు జొన్నలగడ్డతో పాటు వైష్ణవి చైతన్య కూడా హైలెట్ అయ్యింది. కానీ ఎందుకో సిద్ధుకే ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. కానీ ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ బయటపడింది. వైష్ణవి ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ ప్లే చేస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమయితే వైష్ణవికి మరింత యాక్టింగ్ చేసే స్కోప్ ఉంటుందని, అందులో బాగా యాక్ట్ చేస్తే మరిన్ని ఆఫర్లు కొట్టేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ‘జాక్’ మూవీ వైష్ణవి చైతన్య కెరీర్‌లో చాలా కీలకం అని భావిస్తున్నారు.
Also Read: నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎస్‌కేఎన్‌తో మనస్పర్థలపై వైష్ణవి చైతన్య రియాక్షన్
యాక్టింగ్ బాగుంది
‘బేబి’ తర్వాత ‘లవ్ మీ’ అనే మూవీలో హీరోయిన్‌గా కనిపించింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో ఆశిష్ హీరోగా కనిపించాడు. హీరోగా ఆశిష్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్‌గా వైష్ణవి పాత్రకు కూడా సమానంగా ప్రాధాన్యత అందించారు మేకర్స్. అంతే కాకుండా ‘లవ్ మీ’ సినిమా క్లైమాక్స్‌లో వైష్ణవి కనబరిచిన నటన చాలామందిని ఆకట్టుకుంది. అందుకే తన యాక్టింగ్‌ను తెరపై మరింత చూడాలని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ‘లవ్ మీ’ తర్వాత ‘జాక్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఏప్రిల్ 10న ‘జాక్’ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.