E-Paper
Advertisement

ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ మటన్ పెప్పర్ మసాలా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!

ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ మటన్ పెప్పర్ మసాలా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!
Advertisement

Mutton Pepper Masala: వేడి వేడి అన్నంలో చిక్కటి మటన్ గ్రేవీ కలుపుకుని, ఘాటైన నల్లమిరియాల రుచిని ఆస్వాదిస్తుంటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేనిది కదూ! ముఖ్యంగా మటన్ ముక్కలకు మసాలాలు బాగా పట్టి, ప్రతి ముద్దా నోరూరించేలా ఉంటే ఇంకో ముద్ద ఎక్కువ తినకుండా ఉండలేం. అలాంటి అదిరిపోయే రుచిని ఇంట్లోనే సొంతం చేసుకోవాలంటే ఈసారి ‘మటన్ పెప్పర్ మసాలా’ ట్రై చేయండి. రొటీన్ మటన్ కర్రీ, ఫ్రైలకు భిన్నంగా ఘాటుగా, చిక్కటి గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్‌లో తయారు చేసుకోవచ్చు. అన్నం, బగారా రైస్, పరోటా.. దేనితో తిన్నా ఈ వంటకం అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ నోరూరించే మటన్ పెప్పర్ మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు:

మేక మాంసం (మటన్) – అరకిలో
నల్ల మిరియాలు – రెండు టీస్పూన్లు
ధనియాలు – ఒక టీస్పూన్
జీలకర్ర – ఒక టీస్పూన్
సోంపు – అర్ధ టీస్పూన్
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
దాచినచెక్క – చిన్న ముక్క
ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరిగినవి)
టమోటాలు – రెండు (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – నాలుగు (నిలువుగా కోసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
పసుపు – అర్ధ టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
నిమ్మరసం – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం ఇలా:

Advertisement

మేక మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, దాచినచెక్క వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా చేసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు కుక్కర్‌లో మూడు స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు టమోటా ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు చేర్చి టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

Advertisement

టమోటాలు బాగా మగ్గిన తర్వాత శుభ్రం చేసిన మటన్ ముక్కలు వేసి బాగా కలిపి, ఐదు నిమిషాల పాటు అధిక మంటపై వేయించాలి. ఆ తర్వాత ముందుగా నూరుకున్న ప్రత్యేక మిరియాల మసాలా పొడిని అందులో వేసి మటన్‌కు బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు అర గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి, కుక్కర్‌ను నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

విజిల్స్ వచ్చి ఆవిరి పోయాక మూత తీసి, గ్రేవీ చిక్కబడే వరకు సన్నని మంటపై మరికొద్ది సేపు ఉంచాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం చల్లుకుని దించేస్తే ఎంతో రుచికరమైన మటన్ పెప్పర్ మసాలా సిద్ధమైనట్టే ఇక.

Tags

Related News

పైకి నవ్వుతున్నా లోపల ఆందోళనా.. ఈ 5 సంకేతాలు మీలో ఉంటే బీ కేర్ ఫుల్!

10 నిమిషాల్లో పర్ఫెక్ట్ చైనీస్ స్టైల్ షెజ్‌వాన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. టేస్ట్ నెక్ట్స్ లెవెల్!

ఫిట్‌గా ఉండటానికి రోజూ 10 వేల అడుగులు అవసరం లేదా? అసలు ఎంత నడిస్తే సరిపోతుంది?

ఫోన్, ల్యాప్‌టాప్ ఎక్కువగా వాడుతున్నారా? కళ్లలో మంట, పొడిబారడం సమస్యను తగ్గించుకోండిలా

పేరెంట్స్ టీచర్స్ మీటింగ్.. పిల్లల మార్కులే కాదు ఈ 5 ప్రశ్నలు తప్పనిసరిగా అడగండి

చాణక్య నీతి.. మీతో తియ్యగా మాట్లాడే ప్రతి ఒక్కరినీ నమ్మకండి

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ వల్ల పేగు క్యాన్సర్ రిస్క్ తీవ్రం.. డాక్టర్ ఏం చెప్పారంటే

Big Stories

Advertisement
×