E-Paper
Advertisement

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Advertisement

Nuclear Clock: మన చుట్టూ ఉన్న సాధారణ అటామిక్ క్లాక్స్‌లో అణువు చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లలో జరిగే మార్పులను టైమ్ కొలవడానికి ఉపయోగిస్తారు. కానీ న్యూక్లియర్ క్లాక్‌లో సీన్ మొత్తం మారిపోతుంది. ఇందులో థోరియం-229 అనే పదార్థాన్ని కాల్షియం ఫ్లోరైడ్ క్రిస్టల్‌లో ఉంచుతారు. దానిపై అత్యంత కంట్రోల్ చేసిన అల్ట్రావయొలెట్ లేజర్ వేస్తే అణు కేంద్రకంలోని రెండు ఎనర్జీ స్టేట్స్ మధ్య మార్పు జరుగుతుంది. ఆ మార్పునే టైమ్‌కు రిఫరెన్స్‌గా తీసుకుంటారు. అంటే ఎలక్ట్రాన్ కదలికలతో కాదు.. ఏకంగా అణు కేంద్రకంలో జరిగే మార్పులతో కాలాన్ని కొలుస్తారన్నమాట.

భవిష్యత్తులో..

ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అణు కేంద్రకం చాలా చిన్నది, చాలా గట్టిగా బంధించబడి ఉంటుంది. కాబట్టి బయట వాతావరణ ప్రభావాలకు ఇది తక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి అయితే GPS, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సిస్టమ్స్, డేటా నెట్‌వర్క్స్ లాంటి వాటిలో టైమ్ కచ్చితత్వం మరింత పెరగొచ్చు. అంతేకాదు ఆస్ట్రియా శాస్త్రవేత్తలు ఈ క్లాక్‌తో డార్క్ మ్యాటర్ కోసం కూడా వెతికారు. డార్క్ మ్యాటర్ కనిపించలేదు కానీ.. ఇలాంటి అత్యంత సూక్ష్మమైన మార్పులను గుర్తించగల సామర్థ్యం ఈ క్లాక్‌కు ఉందని ప్రయోగం చూపించింది.

కొత్త టూల్..

Advertisement

ఇప్పటికైతే ఇవి ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన క్లాక్స్‌ను మించలేదు. కానీ.. కాలాన్ని కొలిచే టెక్నాలజీ నుంచి.. విశ్వంలో దాగి ఉన్న కొత్త భౌతిక శాస్త్రాన్ని కనిపెట్టే టూల్‌గా మారే అవకాశం ఉంది. అంటే.. ఇకపై టైమ్‌ను కొలవడమే కాదు.. టైమ్‌లో దాగిన రహస్యాలను కూడా వెతకబోతున్నారన్నమాట.

Also read: జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల

Tags

Related News

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!

బోర్‌ నీళ్లకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ బెస్ట్? RO మోడల్స్ ఎందుకు ఎంచుకోవాలి?

రూ.16,300 వరకు ఆదా.. అమెజాన్ సేల్‌లో Vivo X300 Ultraపై సెన్సేషనల్ ఆఫర్!

Big Stories

Advertisement
×