Summer Skin Care: వేసవి కాలం వచ్చిందంటే చాలు సున్నితమైన చర్మంపై డీహైడ్రేషన్, మొటిమలు, మచ్చలు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటించడం ద్వారా వాటి ప్రమాదాలను ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఇవి వేసవిలో మీ చర్మాన్ని చల్లబరచడమే కాకుండా మెరిసేలా, ఆరోగ్యంగా చేయాలంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. మండే ఎండల్లో కూడా మీ చర్మం అందంగా మెరుస్తూ ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్తాని మిట్టి:
ముల్తాని మిట్టి అనేది ఒక సహజమైన, ప్రభావ వంతమైన స్కిన్ కేర్ ప్రొడక్ట్. ఇది అనేక రకాలు చర్మానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో చర్మానికి ముల్తాని మిట్టి వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ముల్తాని మిట్టి చర్మం నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను కూడా తెరుస్తుంది. తద్వారా చర్మాన్ని లోతుగా కూడా శుభ్రప రుస్తుంది. ఇది చర్మపు రంగును కాంతివంతంగా మారుస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని తాజాగా ఉంచడంలో కూడా ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
ముల్తాని మిట్టిని రోజ్ వాటర్ లేదా కాస్త చల్లటి నీటితో కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయండి. తర్వాత 10-15 నిమిషాలు ఆరనివ్వండి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మెరిసిపోతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
గంధం పొడి:
వేల సంవత్సరాలుగా భారతీయులు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో గంధపు పొడి వాడుతున్నారు. వేసవిలో వచ్చే చికాకు, మంట, దద్దుర్లు నివారించడానికి గంధం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుడా గంధపు చెక్కలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇది చర్మానికి తేమను అందిస్తుంది. అంతే కాకుండా ఇది మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం లోపలి నుండి కూడా వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి గంధం ఉపయోగించడం మంచిది.
ఎలా ఉపయోగించాలి ?
గంధపు పొడిని రోజ్ వాటర్ లేదా నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
కాఫీ పౌడర్ :
కాఫీ పౌడర్ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాఫీ పౌడర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా , యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. వేసవిలో కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్ తయారు చేయడం వల్ల స్కిన్ టానింగ్ తగ్గడమే కాకుండా, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ముఖంపై మెరుపును తెస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది.
Also Read: గుమ్మడి విత్తనాలతో.. మతిపోయే లాభాలు !
ఎలా ఉపయోగించాలి ?
కాఫీ పౌడర్‌ను పెరుగు లేదా తేనెతో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత, సున్నితంగా మసాజ్ చేసి, ఆపై శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. అంతే కాకుండా సమ్మర్ లో నిర్జీవంగా ఉన్న ముఖానికి ఇది కొత్త మెరుపును అందిస్తుంది.