Soaking Dry Fruits: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, పోషకాహారం అధికంగా ఉండే వాటిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోతే అవి మీ శరీరానికి హానికరం అని మీకు తెలుసా ? డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ నానబెట్టకుండా తింటే హాని కలిగిస్తాయి. మరి ఏ ఏ డ్రై ఫ్రూట్స్ నానబెట్టకుండా తినడం వల్ల హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిని నానబెట్టకుండా అస్సలు తినకూడదు:
ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలను నానబెట్టకుండా అస్సలు తినకూడదు. వీటిని ద్రాక్షల నుండి తయారు చేస్తారు. వీటిలో సహజ చక్కెరలతో పాటు యాంటీ ఇక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ ఎండు ద్రాక్షలను నానబెట్టకుండా తినడం వల్ల వాటిలో చక్కెర అధికంగా ఉండటం వల్ల అది మీ ఆరోగ్యం పై ప్రతి కూల ప్రభావాన్ని చూపుతుంది.
బాదం: బాదం పప్పును సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. వీటిని నానబెట్టకుండా తినడం వల్ల ఇందులోని పోషకాలు శరీరానికి అంతగా శోషించబడవు. పెలికా అని పిలిచే బాదంపై ఉండే పై పొరలో టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే ?
నానబెట్టిన బాదం: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే టానిన్లు తొలగించబడతాయి. అంతే కాకుండా శరీరంలో పోషకాలు సులభంగా గ్రహించేలా చేస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా బాదం పప్పులను నానబెట్టడం వల్ల అవి మృదువుగా మారతాయి. అంతే కాకుండా నానబెట్టిన బాదం నమలడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.
ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షను నానబెట్టి తినడం వల్ల వీటిలో ఉండే అదనపు చక్కెర సమతుల్యం అవుతుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా నానబెట్టిన ఎండుద్రాక్ష శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లను కూడా సక్రియం చేస్తాయి.
వాల్నట్:
చాలా మంది తమ మెదడుకు పదును పెట్టడానికి వాల్‌నట్‌లను తరచుగా తింటూ ఉంటారు. వాల్‌నట్‌లు మెదడుకు మేలు చేస్తాయి .దగ్గు మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, మినరల్స్ , విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వాల్‌నట్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల పరిమాణం కూడా ఒక వ్యక్తి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాల్‌నట్‌లను తినడానికి ఉత్తమ మార్గం పాలలో లేదా శుభ్రమైన నీటిలో నానబెట్టడం.
అంజీర్ :
అత్తిపండ్లు , ఒక రుచికరమైన డ్రై ఫ్రూట్. ఇవి ఫైబర్‌తో నిండి ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎలాంటి కొవ్వు లేదా కొలెస్ట్రాల్ ఉండదు. అదనంగా పిండి పదార్థాలు, చక్కెర కూడా ఇందులో కనిపిస్తాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని నానబెట్టి తినడం పునరుత్పత్తికి మంచిదని భావిస్తారు. పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళలు ఈ డ్రై ఫ్రూట్‌ని నీటిలో నానబెట్టిన తర్వాత తినాలి.
Also Read: మీ జుట్టు రోజు రోజుకు సన్నబడుతోందా ? ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్
నానబెట్టిన శనగలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఫైటిక్ యాసిడ్ స్థాయి కూడా తగ్గుతుంది. ఇది పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. మొలకల రూపంలో శనగలను తినడం వల్ల పోషకాల నాణ్యత చాలా వరకు పెరుగుతుంది.