కరోనా సృష్టించిన అల్లకల్లోలన్నీ ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఎంతో మంది ప్రాణాలను తీసింది. కోవిడ్ 19 రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారంతా కరోనా ధాటికి తట్టుకోలేకపోయారు. అయితే ఆ సమయంలో ఎంతోమంది మహిళలు గర్వంతో ఉన్నారు. అలా లాక్‌డౌన్ సమయంలో అంటే కరోనా విజృంభిస్తున్న సమయంలో పుట్టిన పిల్లలు రోగనిరోధక శక్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి పరిశోధనలు జరిగాయి. అందులో ఆ పిల్లల రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉన్నట్టు బయటపడింది.
కొత్త పరిశోధన ప్రకారం లాక్‌డౌన్ సమయంలో జన్మించిన శిశువుల రోగనిరోధక శక్తి… సాధారణ సమయంలో పుట్టిన పిల్లలతో పోలిస్తే చాలా బలంగా ఉంది. ఐర్లాండ్ లోని యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. లాక్‌డౌన్‌లో పుట్టిన పిల్లల పొట్టలోని మైక్రోబయోమ్ అంటే బ్యాక్టీరియాలు చాలా భిన్నంగా ఉన్నట్టు వారు కనుగొన్నారు. దీనివల్ల ఈ పిల్లల్లో అలర్జీ సమస్యలు చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
మైక్రోబయోమ్ అంటే…
గట్ మైక్రోబయోమ్ అంటే మన పొట్టలోని బ్యాక్టీరియా. వీటిని మంచి బ్యాక్టీరియా అని చెప్పుకుంటారు. ఆహార పదార్థాలలో జీర్ణం కాకుండా మిగిలిపోయిన భాగాలను జీవక్రియలో భాగం చేసేందుకు శక్తిని పునరుద్ధరించడానికి, ఇన్ఫెక్షన్ నుండి మనల్ని కాపాడడానికి గట్ మైక్రో బయోమ్ ఎంతో పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా కూడా మారుస్తుంది.
ఈ కొత్త అధ్యయనంలో కోవిడ్ వచ్చిన ఒక సంవత్సరంలో జన్మించిన పిల్లల్లో ఐదు శాతం మంది మాత్రమే అలెర్జీ బారిన పడుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. మిగతా వారంతా కూడా బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని, వారు అలెర్జీల బారిన తక్కువ పడుతున్నట్టు గుర్తించారు. లాక్డౌన్ సమయంలో పుట్టిన పిల్లల్లో కేవలం 17 శాతం మంది మాత్రమే యాంటీబయోటిక్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు పుట్టిన పిల్లల్లో ఈ రేటు 80 శాతంగా ఉంది.
లాక్డౌన్ సమయంలో జన్మించిన పిల్లల్లో బలమైన రోగనిరోధక శక్తి సహజంగానే వచ్చినట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీనికి అతిపెద్ద కారణం వారు కాలుష్యానికి గురికాకపోవడమే. ఎందుకంటే కరోనా సమయంలో గర్భిణీలు అంతా ఇంట్లోనే ఉన్నారు. వారు వాయు కాలుష్యానికి దూరంగా ఉన్నారు. దీనివల్ల పిల్లలు ఊపిరితిత్తుల్లోకి తక్కువ వ్యర్ధాలు చేరాయి. దీనివల్లే వారు ఎంతో ఆరోగ్యంగా పుట్టారు.
2020లో కరోనా భారతదేశంలోకి ప్రవేశించింది. ఎన్నో నెలల పాటు మనదేశంలో లాక్ డౌన్ బారిన పడింది. కేవలం మనదేశమే కాదు ప్రపంచ దేశాలలో లాక్డౌన్ అనేది అనివార్యంగా మారింది. అయినా కూడా కరోనా బారిన పడి లక్షల మంది మరణించారు. ఇప్పటికీ కరోనాను మర్చిపోలేని వారు ఎంతోమంది. ఒకే కుటుంబంలో నలుగురైదుగురు కూడా కరోనా బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. అందుకే కరోనా అనేది ఒక మహమ్మారిలాగా మారిపోయింది. ప్రస్తుతం కరోనాను తట్టుకునే శక్తి మానవాళికి వచ్చినట్టు పరిశోధకులు చెబుతున్నారు.