Night Health Tips: చీకటి పడింది.. కానీ ఆ చీకటిలో మీరు ఇలా చేస్తే మాత్రం.. మీ లైఫ్ వెయ్యేళ్లు గ్యారంటీనట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు వైద్యులు, విశ్లేషకులు. అసలు చీకటి పడితే మనం ఏమి చేయాలో తెలుసుకొని, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోజంతా పనిచేసి రాత్రికి శరీరమంతా అలసిపోయి, విశ్రాంతికి సిద్ధమవుతుంది. కానీ మనలో చాలా మంది ఆ రాత్రి సమయాన్ని ఆరోగ్యానికి అనుకూలంగా కాకుండా గడిపేస్తూ.. నిద్ర లేకుండా మొబైల్ లో గడిపే మానసిక అలసట, అర్థరాత్రి భోజనాలు, ఆలస్యంగా పడుకునే అలవాట్ల వల్ల ఆరోగ్యాన్ని చీమలు కొరికినట్టు కొరుకుతుంటారు. నిజానికి రాత్రి మన ఆరోగ్యం మెరుగయ్యే హీలింగ్ టైం. దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే చాలు.. మన ఆరోగ్యమే మహా భాగ్యమట.
అసలు ఏం చేయాలంటే?
రాత్రి భోజనం అన్నాక మన శరీరం తేలికగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా రాత్రి ఆహారం ఎంత తక్కువగా తింటే, అంత మంచిది. పచ్చకూరలు, వెన్న, పాల పదార్థాలు, పండ్లు.. ఇవే రాత్రి తీసుకోవాల్సిన ఆహారం. అన్నం, మాంసాహారం, ఎండు వంటలు.. ఇవన్నీ రోజులో మధ్యాహ్నం తీసుకుంటే మంచిది.
రాత్రి పడుకునే ముందు 10 నిమిషాల నడక తప్పనిసరిగా చేయాలి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మన శరీరం పూర్తిగా రిలాక్స్ కావడానికి ఇది మంచి పద్ధతి. ఏదైనా సరదాగా మాట్లాడుకుంటూ, కుటుంబ సభ్యులతో 5 నుండి 10 నిమిషాలు నడక చేస్తే, అది కేవలం శరీరానికే కాదు మనసుకూ ఓ రిలీఫ్‌గా పనిచేస్తుంది.
ఈ ఒక్క పని చేయవద్దు
కొందరికి రాత్రి పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ చూసి మత్తుగా నిద్ర వస్తుందని అనిపించవచ్చు. కానీ ఆ బ్లూ లైట్ వల్ల నిద్ర నాణ్యత పూర్తిగా బాగా తగ్గిపోతుంది. మెదడు అలెర్ట్‌గా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, పడుకునే ఒక గంట ముందు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ వాడకూడదనే నిబంధన మీరు స్వయంగా తీసుకుంటే, అది మీ శరీరానికి ఓ గొప్ప గిఫ్ట్‌లా మారుతుంది.
ఇలా చేయండి
రాత్రి పడుకునే ముందు తులసీ ఆకులు కలిపిన నీరు తాగితే అది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లి నీరు తీసుకుంటే రక్తనాళాల్లో ముసుగులు తొలగిపోతాయి, శరీరంలో వేడి తగ్గుతుంది. ఆయుర్వేదం కూడా దీనిని మన్నించిందే. అలాగే బెల్లం, నెయ్యి వేసిన వేడి పాలూ నిద్రను బాగా ప్రోత్సహిస్తాయి. ఇది మన ప్రాచీన ఆచారాలలో ఒక భాగం.
ఈ ఆసనం ఆచరించండి
ఆసనాలలో విపరీత కర్ని అనే యోగాసనం చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో గోడకు తల క్రిందగా, కాళ్లు పైకి పెట్టుకుని అర్థగంట పాటు శరీరాన్ని ఓదార్చుకోవాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది, మనశ్శాంతి తీసుకువస్తుంది. అదే విధంగా, బ్రెయిన్‌లో శాంతిని కలిగించేలా పనిచేస్తుంది.
కొందరికి రాత్రి గ్యాస్ సమస్య ఇబ్బందిగా ఉంటాయి. అలాంటివారు తినేటప్పుడు చివర్లో తులసి గింజలు, పెర్లే గింజలు లేదా షజీరా నమలండి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తాయి. ఇది చిన్న అలవాటు అయితేనేం, పెద్ద ఫలితాలనిస్తుందిలే!
ఇవి చిన్న చిట్కాలే. కానీ ఇవి మన జీవనశైలిని పూర్తిగా మార్చేస్తాయి. నిద్ర సమయంలో శరీరంలో పెద్ద ఎత్తున పునరుత్పత్తి, హార్మోన్ సమతుల్యత, జీర్ణవ్యవస్థ పునర్నిర్మాణం వంటి ముఖ్యమైన ప్రక్రియలు జరుగుతాయి. మనం రాత్రిని ఎలా గడిపామో, మన ఆరోగ్య స్థితి దానిపైనే ఆధారపడి ఉంటుంది.
నిద్ర ముందు మనసులో ఎలాంటి ఒత్తిడీ ఉండకూడదు. ఆ రోజు జరిగినవాటిని పక్కకు పెట్టి, ఒక చిన్న ధ్యానం, లేదా మౌనంగా కూర్చోవడం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది నిద్ర పైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలా ఆరోగ్యంగా జీవించాలంటే మొదటి అడుగు.. రాత్రిని గౌరవించడమే!
అందుకే రాత్రి ఇలా చేయండి. ఆరోగ్యాన్ని డైలీ బూస్ట్ చేసుకోండి. వెయ్యేళ్లు బతికినట్టు ఆరోగ్యం గ్యారంటీ అన్నంత ఫీల్ మీకు కలుగుతుంది. నిద్రలోనే ఆరోగ్యాన్ని గెలుచుకునే ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందండి. ఇక మీ రాత్రులు.. ఆరోగ్య రహస్యాల మార్గంలో తొలి అడుగులు అవుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు బిగ్ టీవీ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.