ఈ హైటెక్ యుగంలో ఇంటర్నెట్ లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం దాదాపు అసాధ్యం. చాలా మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో ఇంటర్నెట్, మొబైల్ యాప్‌లపై పూర్తిగా ఆధారపడుతున్నారు. ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా, క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, డబ్బు బదిలీ చేయాలన్నా, ప్రపంచంలోని ఏ మూలనైనా మీ కుటుంబం, స్నేహితులతో మాట్లాడాలన్నా, ఇంటర్నెట్ అన్నింటినీ సులభతరం చేస్తోంది.
తూర్పు ఆఫ్రికాలోని ఎరిట్రియా ప్రస్తుత ప్రపంచంతో పోల్చితే ఓ 50 ఏళ్లు వెనక జీవిస్తోంది. ఇక్కడ ఇప్పటికీ ఇంటర్నెట్ ఉపయోగించరు. ఈ దేశం ఎర్ర సముద్రం ఒడ్డున ఉంది. దీని రాజధాని అస్మారా. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో, ఇంటర్నెట్ ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా మారినా, ఎరిట్రియాలో ఇంటర్నెట్ సేవలు దాదాపు అందుబాటులో లేవు. ఈ దేశంలోని 99% జనాభా ఇంటర్నెట్ ఉపయోగించరు. కొంత మేర ఇంటర్నెట్ సదుపాయం ఉన్నాయి. స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ Wi-Fi అందుబాటులో ఉన్న కేఫ్‌లు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. కానీ, అక్కడ కూడా నెట్ వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఈ దేశంలో ఇంటర్నెట్ పొందడం అనేది చాలా ఖరీదైన వ్యవహారం. ఎవరైనా గంటసేపు Wi-Fiని ఉపయోగించాలనుకుంటే వారు సుమారు 100 ఎరిట్రియన్ నక్ఫా చెల్లించాలి. ఇది భారతీయ కరెన్సీలో రూ.100తో సమానం. ఇక్కడి జనాల ఆర్థిక పరిస్థితిని అంతంత మాత్రమే. అంత ధర చెల్లించి ఇక్కడ ఇంటర్నెట్ వినియోగించే పరిస్థితిలో జనాలు లేరు. ఇక్కడ ఇంటర్నెట్ ఉపయోగించకపోవడానికి అసలు కారణం ఇదే అని చెప్పుకోవచ్చు.
ఇంటర్నెట్, సోషల్ మీడియా మాత్రమే కాదు, ATM లాంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. ప్రస్తుత రోజుల్లో ఏటీఎం సేవలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో సర్వసాధారణం. ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ ఎరిట్రియాలో, ATM లేదు.
Read Also: కిస్సింగ్ బగ్.. అమెరికాను వణికిస్తున్న ఈ కీటకం.. ఏం చేస్తుందో తెలుసా?
ఎరిట్రియాలో ఇంటర్నెట్ లేకపోవడం అనేది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక పోకడకు ఊరంగా ఉన్నాయని తెలియజేస్తుంది. ఈ దేశం డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, ఇక్కడి ప్రజలు తమ దైనందిన జీవితానికి ఇంటర్నెట్ పై ఆధారపడరు. వారు ఇప్పటికీ పాత సాంప్రదాయ పద్ధతులను మాత్రమే ఉపయోగిస్తున్నారు. మొత్తంగా ఇక్కడి ప్రజలు అర దశాబ్దానికి వెనుక నివసిస్తున్నారు. ఈ దేశం ప్రస్తుత ఇతర దేశాల మాదిరిగా ముందుకు రావాలంటే దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఇతర ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారు. ఎరిట్రియా దేశం మాత్రమే కాదు, దాని పరిసర దేశాలు కూడా ఇంటర్నెట్, సోషల్ మీడియాను తక్కువగానే వినియోగిస్తున్నారు.
Read Also: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!