E-Paper
Advertisement

ఇండియన్ సినిమా అంటే నేనే కాదు.. యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇండియన్ సినిమా అంటే నేనే కాదు..  యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Advertisement

Yash’s Big Statement on Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ను తాజాగా బెంగళూరులో అట్టహాసంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.  ‘టాక్సిక్’ సినిమాను కేవలం కన్నడ చిత్రంగా చూడకూడదన్నారు. ఇది ఒక భాషకు లేదా ప్రాంతానికి పరిమితమైన సినిమా కాదని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులు కలిసి పనిచేసిన భారతీయ సినిమా అన్నారు.

ఇది కేవలం యష్ సినిమా కాదు..

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన యశ్.. భారతీయ సినిమాను ఇకపై కన్నడ, తెలుగు, తమిళం అంటూ విడదీయాల్సిన అవసరం లేదన్నారు. భాషలు వేరైనా అందరూ కలిసి పనిచేసి మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని చెప్పారు. ‘‘ఇకపై ఇది కన్నడ, తమిళ, తెలుగు కాదు.. ఇది ఒక భారతీయ చిత్రం’’ అన్నారు యశ్. ‘టాక్సిక్’లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు కలిసి పనిచేస్తున్నారని యశ్ చెప్పారు. అందరి ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సినిమా మంచి ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. తాను మాత్రమే ఈ సినిమాకు కారణం కాదని, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి ఉందని యశ్ స్పష్టం చేశారు. అందుకే ‘టాక్సిక్’ను తన సినిమా అని చెప్పడం కంటే భారతీయ సినిమా అని చెప్పడం సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

ప్రతి నటుడిలోనూ ఈగో ఉంటుంది..

ఇదే సమయంలో నటీనటుల గురించి యశ్ చేసిన మరో వ్యాఖ్య కూడా ఆసక్తిని కలిగించింది. ప్రతి నటుడికి తన పని విషయంలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం ఉంటుందని, ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారని చెప్పారు. ‘‘ప్రతి నటుడు స్వార్థపరుడే. అది వాస్తవం’’ అని యశ్ అన్నారు. అయితే, ఇది తప్పు అనే అర్థంలో తాను చెప్పడం లేదని, ఒక నటుడు తన పాత్రను అత్యుత్తమంగా చేయాలనే ఆలోచనతో ఉండటం సహజమేనని ఆయన వివరించారు.

ఈగోలను పక్కన పెట్టి పనిచేశారు..

Advertisement

ఇంత పెద్ద తారాగణంతో కలిసి పనిచేసే సమయంలో నటీనటులకు కొన్నిసార్లు అసౌకర్యం, అభద్రతాభావం కలగవచ్చని యశ్ చెప్పారు. ముఖ్యంగా తమకంటే ఎంతో అనుభవం, పేరు ఉన్న వారితో కలిసి పనిచేసేటప్పుడు ఇలాంటి భావనలు రావడం సహజమన్నారు. అయితే ‘టాక్సిక్’ విషయంలో అందరూ తమ వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టారని యశ్ తెలిపారు. సినిమా విజయం కోసం ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యంతో పనిచేశారని చెప్పారు. తమ తమ రంగాల్లో ఇప్పటికే మంచి పేరు సంపాదించిన నటీనటులు, టెక్నీషియన్లు ఈ సినిమా కోసం కలిసి పనిచేశారని యశ్ అన్నారు. ఎవరి వ్యక్తిగత ఇమేజ్ గురించి ఆలోచించకుండా సినిమాను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లడంపైనే అందరూ దృష్టి పెట్టారని చెప్పారు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేశారని చెప్పుకొచ్చారు.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది.

Read Also: అందరికీ నో చెప్పే నయన్.. యశ్ అడగ్గానే అందుకు ఓకే చెప్పిందట.. ‘టాక్సిక్’ ఈవెంట్‌ లో సర్‌ప్రైజ్!

Tags

Related News

అందరికీ నో చెప్పే నయన్.. యశ్ అడగ్గానే అందుకు ఓకే చెప్పిందట.. ‘టాక్సిక్’ ఈవెంట్‌ లో సర్‌ప్రైజ్!

‘వారణాసి’ బర్త్ డే ట్రీట్ అదుర్స్.. ఏమున్నాడ్రాబాబు మహేష్..

‘వారణాసి’ కథ ఇదేనా.. మహేష్ సినిమా స్టోరీ లీక్?

అమ్మతో బాండింగ్‌పై జేసన్ కామెంట్స్…కొడుకు కోసమైనా కలుస్తారా ?

నయన్ పొగడ్తలు.. జనాల సెటైర్లు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ హీరోనే తోపా?

వరుణ్ తేజ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేశాయా?

సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!

Big Stories

Advertisement
×