Obesity In Rural Women: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మఖ్యంగా పట్టణాలతో పోలిస్తే.. గ్రామాల్లో నివసిస్తున్న మహిళల్లో ఈ సమస్య రోజు రోజుకూ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవన శైలి మారడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ప్రసవం తర్వాత మహిళలు బరువు పెరిగేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి పలు కారణాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హార్మోన్ల అసమతుల్యత:
మహిళల్లో నిద్ర లేమి సమస్య, అంతే కాకుండా పదే పదే గర్బధారణలు, ఇతర కారణాల వల్ల కూడా ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఇలా మహిళలు బరువు పెరుగుతూనే ఉంటారు. గర్భదారణ సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవలసి ఉంటుంది. శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ బరువు తగ్గడం.. కూడా తర్వాత కష్టంగా మారుతుంది. ఇదే కాకుండా నిద్ర వేళల్లో మార్పులు, హార్మోన్ల అసమ తుల్యత బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.
ఊబకాయంతో బాధపడుతున్న మహిళల వయస్సు:
ఊబకాయంతో బాధపడుతున్న మహిళల్లో అత్యంత సాధారణ వయస్సు 30-50 సంవత్సరాలు. ఊబకాయం ఉన్న మహిళలకు కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, శారీరక శ్రమ తగ్గడం, పని సంబంధిత అలసట వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
NFHS డేటా ప్రకారం:
భారతదేశంలో మహిళల్లో ఊబకాయం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది.
సర్వే సంవత్సరం పట్టణ (%) గ్రామీణ (%)
NFHS-2 (1998-99) 23.5% 5.9%
NFHS-3 (2005-06) 15.1% 0.6%
NFHS-4 (2015-16) 19.7% 19.7%
NFHS-5 (2019-21) 33.2% 19.7%
నివారణ చర్యలు :
మహిళలు తమ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ప్రాసెస్ చేసిన , ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
Also Read: ఉల్లిరసంలో ఈ 2 కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
తగినంత నీరు త్రాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది.
ఒత్తిడిని నియంత్రించడానికి ధ్యానం, యోగా , ఇతర మానసిక ఆరోగ్య చర్యలను అనుసరించండి.
చక్కెర , కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించి, తాజా, సహజమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.