E-Paper
Advertisement

భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్?

భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్?
Advertisement

Office Friendship: ఎవరు అవునన్నా కాదన్నా.. మనలో చాలామంది ఇంట్లో కన్నా ఆఫీస్‌లోనే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నామన్నది వాస్తవం.ఇక మరికొందరైతే ఇంట్లో వాళ్ల కన్నా ఆఫీస్ వాళ్లతోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు.ఆ క్రమంలోనే అక్కడ ఫ్రెండ్షిప్ ఏర్పడడం చాలా కామన్.కానీ ఆ ఫ్రెండ్షిప్ బోర్డర్స్ క్రాస్ అయితేనే అసలు సమస్య.

ఆఫీస్‌లో ఫ్రెండ్షిప్ తప్పు కాదు

మామూలుగా ఆఫీసులో కలిసి పనిచేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, టీ తాగడం, ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేయడం.. ఇవన్నీ చాలా కామన్.పైగా ఇందులో తప్పు కూడా లేదు.

ఎప్పుడు అనుమానాలు మొదలవుతాయి?

Advertisement

కానీ రోజంతా ఒకే వ్యక్తితో మాట్లాడటం, ఆఫీస్ అయిపోయిన తర్వాత గంటల తరబడి ఫోన్‌లో చాటింగ్ చేయడం, ఏ విషయాన్నైనా ఇంట్లో చెప్పుకోకుండా అతనితోనే లేదా ఆమెతోనే పంచుకోవడం మొదలైతే మాత్రం.. మన లైఫ్ పార్ట్నర్‌కు డౌట్ రావడం చాలా సహజం.

‘మేము జస్ట్ ఫ్రెండ్స్’ అనడం సరిపోతుందా?

అయితే చాలామంది “మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే” అంటుంటారు.ఒక రకంగా అది నిజమే కావచ్చు.కానీ ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తి బాధపడుతున్నాడా లేదా అనేది కూడా ఆలోచించాలి.ఎందుకంటే భార్య అయినా, భర్త అయినా.. తనని కాకుండా వేరే వాళ్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అనిపిస్తే బాధపడటం సహజమే.

పర్సనల్ విషయాలు పంచుకునే ముందు ఆలోచించండి

Advertisement

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆఫీసులో ఎవరికైతే మన సమస్యలు చెప్పుకుంటూ ఉంటామో, వాళ్లకే మన ఇంట్లో జరిగే గొడవలు కూడా పంచుకుంటుంటాం.మొదట్లో ఇది కాస్త ఓదార్పుగా మొదలై.. ఆ తర్వాత ఎమోషనల్‌గా దగ్గర అవడానికి ఆస్కారం ఉంటుంది.అందుకే మన పర్సనల్ విషయాలను ఎవరితో పంచుకుంటున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

హద్దుల్లో ఉంటే ఆఫీస్ ఫ్రెండ్షిప్ మంచిదే

అయితే ఆఫీస్ ఫ్రెండ్షిప్ అంటేనే తప్పు అనుకోవడం కూడా సరికాదు.చాలామందికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం.

కానీ ఇంట్లో వారి కంటే ఆఫీస్ వాళ్లకి ఎక్కువ సమయం ఇవ్వడం, మన లైఫ్ పార్ట్నర్ కంటే వాళ్లతోనే ఎక్కువగా మాట్లాడటం, వాళ్లు చూడకుండా ఫోన్ దాచిపెట్టడం, నైట్ సీక్రెట్‌గా చాటింగ్ చేయడం వంటివి మొదలైతేనే బంధం బీటలు వారే అవకాశం ఉంటుంది.

భార్యాభర్తల మధ్య నమ్మకమే బంధానికి బలం

భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యం.మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఏ విషయాలు మాట్లాడుతున్నామో లైఫ్ పార్ట్నర్ దగ్గర అస్సలు దాచుకోకూడదు.ఆఫీస్‌లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా.. మన జీవితంలో ఉండే లైఫ్ పార్ట్నర్‌కే విలువ ఎక్కువ అనే విషయం మర్చిపోవద్దు.

కమ్యూనికేషన్ గ్యాప్ అసలు ఉండకూడదు

ముఖ్యంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అసలు ఉండకూడదు.ఆఫీస్‌లో ఏం జరిగినా ఓపెన్‌గా చెప్పేస్తే ఎలాంటి గొడవ ఉండదు.

ALSO READ:ఉదయం గంటలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఎలా రెడీ చేయాలి?..

స్నేహం ఉండొచ్చు.. కానీ హద్దుల్లో ఉండాలి

ఇక చివరిగా చెప్పాలంటే.. ఆఫీస్ ఫ్రెండ్స్ ఉండటం అసలు తప్పు కాదు.కానీ ఆ ఫ్రెండ్షిప్ భార్యాభర్తల మధ్య ఉన్న బంధానికి ముప్పు తీసుకొస్తేనే అసలు సమస్య.స్నేహం ఉండొచ్చు.. కానీ అది హద్దుల్లో ఉండాలి.అలా ఉంటే ఎలాంటి గొడవ ఉండదు. అలా కాకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తే మాత్రం చిక్కుల్లో పడ్డట్టే!

Tags

Related News

రామాయణం కోసం మాంసాహారం మానేసిన రణ్‌బీర్ కపూర్.. నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ తింటే ఫిట్‌నెస్ ఉంటుందా?

కేర్ హెల్త్ వాళ్లకు పెద్ద షాక్.. ఇక క్యాష్‌లెస్ చికిత్స కట్!

వర్షాకాలంలో ముఖం డల్‌గా మారిందా? కేవలం రూ.20 ఖర్చుతో సూపర్ ఫేస్ ప్యాక్..

ప్రోటీన్ కోసం ఖరీదైన సప్లిమెంట్లు తప్పనిసరి కావు.. ఇదిగో తక్కువ ఖర్చులో పవర్‌ఫుల్ ఇండియన్ ఫుడ్స్

మిగిలిన అన్నంతో ఇలా చేయండి.. ప్లేట్ ఖాళీ కావడం గ్యారంటీ!

ఉదయం గంటలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఎలా రెడీ చేయాలి?..

సింపుల్, డౌన్ టు అర్త్.. ఈ తేదీల్లో పుట్టినవారు సాదాసీదా జీవనం ఇష్టపడతారు

Big Stories

Advertisement
×