E-Paper
Advertisement

Onion Juice for Hair Regrowth: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లిపాయ రసం.. ఇంతకీ సైన్స్ ఏం చెబుతోందంటే?

Onion Juice for Hair Regrowth: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లిపాయ రసం.. ఇంతకీ సైన్స్ ఏం చెబుతోందంటే?
Advertisement

Onion Juice for Hair Regrowth: పురుషుల్లో ఎక్కువగా కనిపించే సమస్య ప్యాచీలుగా జుట్టు రాలడం. వైద్య పరిభాషలో దీనినే ‘అలోపేసియా అరేటా’ అని అంటారు. అయితే తాజా పరిశోధనల్లో ఈ సమస్యతో బాధపడేవారికి ఉల్లిపాయ రసం గొప్ప వరమని తేలింది. దీనిపై జరిగిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఉల్లిపాయ రసం ఎలా పనిచేస్తుంది?

జుట్టురాలే సమస్యను తగ్గించి, ఒకవేళ బట్టతల ఉంటే తిరిగి జుట్టు మొలవడానికి ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణనిచ్చి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే, ఉల్లిపాయ రసంలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు స్కాల్ప్‌పై ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. దీంతో జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది.

Advertisement

Also Read: యవ్వనంగా కనిపించాలా? క్యాన్సర్ దరిచేరకూడదా? అయితే ఈ పింక్ పండును అస్సలు వదలకండి!

పరిశోధనలో తేలిన ఆసక్తికర విషయాలు:

తాజా ప్రయోగంలో కొందరు వ్యక్తులు రోజుకు రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించుకున్నారు. కేవలం 6 వారాల్లోనే దాదాపు 87 శాతం మందిలో కొత్త జుట్టు మొలవడం గమనించారు. కేవలం నీటిని ఉపయోగించిన వారిలో కేవలం 13 శాతం మందిలోనే మార్పు కనిపించింది. పురుషుల్లో 93 శాతం, స్త్రీలలో 71 శాతం మందిలో మంచి రిజల్ట్స్ రావడం విశేషం. కొంతమందికి 2 వారాల నుంచే జుట్టు రావడం మొదలైతే, ఎక్కువ మందికి 4 వారాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు:

Advertisement

ఈ అధ్యయనం కేవలం అలోపేసియా అరేటా ఉన్నవారిపై మాత్రమే జరిగింది. అయితే, ఇది వంశపారంపర్యంగా వచ్చే బట్టతలకి ఎంతవరకు పనిచేస్తుందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే, అతి తక్కువ ఖర్చుతో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉల్లిపాయ రసాన్ని వాడటం వల్ల నష్టమేమీ ఉండదు. కనీసం 6 వారాలపాటు క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు వాడితే మంచి ఫలితం ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

Also Read: తియ్యని సపోటాతో బోలెడన్ని లాభాలు.. కానీ ఆ వ్యాధి ఉన్నవారు మాత్రం అస్సలు తినకూడదు!

Related News

కడుపు నిండా తిన్నా శరీరంలో శక్తి లేదా? మీరు చేసే తప్పులివే

కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతుంటారు

వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే

మీరు ఇంట్లోనే RO వాటర్ తాగుతున్నారా? అది విషపూరితం కావొచ్చు.. ఈ 3 సంకేతాలు గుర్తించండి

ఒకేసారి ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త ఈ కాంబినేషన్లు ప్రమాదకరం

80ల నాటి మన ఇళ్లలో దాగున్న అపురూపమైన జ్ఞాపకాలు.. ఇవి మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా?

గోలీలు, బొంగరాలతో ఆటలు.. నేటి ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆ కిక్కేది?

80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!

Big Stories

Advertisement
×