E-Paper
Advertisement

వెజిటేరియన్ కబాబ్స్.. పండుగవేళ శాఖాహారులకు టేస్టీ రెసిపీ.. ఇంట్లోనే ఇలా చేయండి

వెజిటేరియన్ కబాబ్స్.. పండుగవేళ శాఖాహారులకు టేస్టీ రెసిపీ.. ఇంట్లోనే ఇలా చేయండి
Advertisement

Vegetarian Kebabs Navaratri| పండుగల సమయంలో ప్రతిసారి ఒకే రకమైన వంటకాలు తినడం కొంత బోర్‌గా అనిపిస్తుంది. ఈసారి మీ మెనూలో రుచికరమైన వెజిటేరియన్ కబాబ్స్‌ చేర్చి కొత్త రుచిని ప్రయత్నించండి. సోయా, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ కబాబ్స్ కడుపు నిండేలా ఫీలింగ్ ఇస్తాయి. వీటిని డీప్ ఫ్రై చేయకుండా పెనంపై కాల్చడం వల్ల నూనె కూడా తక్కువగా ఖర్చవుతుంది.చల్లటి కీరాదోశ, పెరుగు డిప్‌తో సర్వ్ చేస్తే ఈ స్నాక్ మరింత రుచికరంగా ఉంటుంది.

నవరాత్రి సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

నవరాత్రులు సమీపిస్తుండటంతో చాలామంది సులభమైన వెజిటేరియన్ వంటకాల కోసం చూస్తుంటారు. సాధారణంగా సబుదానా, బంగాళాదుంపలు, కుట్టు పిండితో చేసిన వంటకాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో మీ మెనూలో ఈ సోయా కబాబ్స్ మంచి మార్పును తీసుకురాగలవు.
అయితే కఠినమైన ఉపవాస నియమాలు పాటించేవారు ముందుగా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సోయా, శనగపిండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, సోయా సాస్ కొన్ని ఉపవాస దీక్షల్లో అనుమతించరు. మీరు పాటించే వ్రత నియమాలకు ఈ పదార్థాలు సరిపోతాయో ముందుగా పరిశీలించండి.

కబాబ్స్ కోసం కావాల్సిన పదార్థాలు ఇవే

Advertisement

150 గ్రాముల సోయా గ్రాన్యూల్స్, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సిద్ధం చేసుకోండి. సగం రెడ్ క్యాప్సికమ్, రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి. రెండు అంగుళాల అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా అవసరం. ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాశ్మీరీ మిర్చి పౌడర్ కలపండి. అలాగే కారం, దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల సోయా సాస్ తీసుకోండి.
ఒక కప్పు శనగపిండి, 450 మిల్లీలీటర్ల నీరు కూడా సిద్ధంగా ఉంచండి.

తయారీ విధానం

ముందుగా సోయాను ఉడికించాలి. ఒక సాస్‌పాన్‌లో 450 మిల్లీలీటర్ల నీళ్లు పోసి మరిగించండి. అందులో సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, అన్ని మసాలాలు, సోయా సాస్ వేయండి. అన్నింటినీ బాగా కలిపి మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించండి. నీరు పూర్తిగా ఇంకిపోయి సోయా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

ఇప్పుడు కబాబ్ మిశ్రమాన్ని రెడీ చేయండి

Advertisement

ఉడికిన సోయా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, రెడ్ క్యాప్సికమ్ కలపండి. తర్వాత శనగపిండి వేసి అన్ని పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని సుమారు 10 నిమిషాలు పక్కన ఉంచండి. దీంతో శనగపిండి పదార్థాలను బాగా కలిపి కబాబ్స్‌కు సరైన ఆకారం ఇస్తుంది.

Also Read: చాణక్య నీతి.. మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మగా మారిందా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

పెనంపై కబాబ్స్‌ క్రిస్పీగా కాల్చాలి

మిశ్రమాన్ని చిన్న భాగాలుగా తీసుకుని కబాబ్స్‌లా ఆకారం ఇవ్వండి. కావాలంటే మధ్యలో స్క్యువర్ పెట్టి ట్రెడిష్నల్ కబాబ్‌లా తయారు చేయవచ్చు.
పెనాన్ని వేడి చేసి కబాబ్స్‌ అందులో ఉంచండి
అన్ని వైపులా సమానంగా కాలేలా వాటిని తరచూ తిప్పండి. బయట భాగం లేత గోధుమరంగులోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చండి.

Also Read: బిజీ మార్నింగ్‌లో కూడా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కావాలా? 10 నిమిషాల్లో రెడీ చేసే రెసిపీలు ఇవే

కీరాదోశ, పెరుగు డిప్‌తో మరింత టేస్ట్

అరకప్పు పెరుగులో తురిమిన కీరాను కలపండి. కీరాలోని అదనపు నీటిని ముందుగా పిండేయాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. వేడివేడిగా ఉన్న సోయా కబాబ్స్‌ చల్లటి పెరుగు డిప్‌తో సర్వ్ చేయండి. పండుగల సమయంలో స్నాక్‌గా లేదా స్టార్టర్‌గా ఈ రెసిపీ తయారు చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.

Related News

నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా చికెన్ మలయ్ కబాబ్ రెసిపీ.. పెనంపైనే సింపుల్‌గా!

ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు.. ఎన్ని రోటీలైనా క్షణాల్లో ఖాళీ అయిపోవాల్సిందే!

నోరూరించే పంజాబీ భేండీ మసాలా..రోటీ,చపాతీకి ఫర్పెక్ట్ కాంబినేషన్

చేపలు లేవు.. అయినా ఈ రెసిపీ పేరు బొమ్మిడాల చారు.. రాయలసీమ సీక్రెట్ రెసిపీ ఇదే!

పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్..ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అద్భుతమైన రుచి

రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ.. గోదావరి రుచి ఇంట్లోనే!

ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

Big Stories

Advertisement
×