E-Paper
Advertisement

ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?

ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?
Advertisement

ట్రంప్ అంటే.. ఈ పేరు వింటే అందరికీ మంటే. కానీ, ఏం చేయగలం.. అతడు అమెరికాకి అధ్యక్షుడై కూర్చున్నాడు. ఫ్రెండ్స్ ఎనిమీస్ అనే తేడా లేకుండా అందరితో ఆటాడేసుకుంటున్నాడు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి. అందుకే.. ఆయనంటే గిట్టని వ్యతిరేకులకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఏకంగా ఆయనకు బంగారంతో విగ్రహాన్ని తయారు చేశారు. అదేంటీ, మంచి పనే కదా చేశారని అనుకుంటున్నారా? అదేనండి ట్విస్టు.. ఆ విగ్రహంలో ట్రంప్ ఒంటి మీద నూలు పోగు కూడా లేదు.

యూరోపియన్ పార్లమెంట్ భవనం సమీపంలో ఆవిష్కరణ

విగ్రహాన్ని రెడీ చేయడమే కాదు. దాన్ని ఏకంగా స్ట్రాస్‌బర్గ్ లోని యూరోపియన్ పార్లమెంట్ భవనం సమీపంలో ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఆ విగ్రహాన్ని 23 క్యారెట్ల బంగారు పూతతో తయారు చేశారు. ప్రముఖ డానిష్ కళాకారుడు జెన్స్ గాల్సియోట్ దీన్ని రూపొందించాడు. ఈ విగ్రహానికి ‘ది ఆరెంజ్ ప్లేగ్’ (The Orange Plague) అని నామకరణం చేశారు.

ఇదో వ్యంగ్య నిరసన..

Advertisement

అమెరికా విదేశాంగ విధానం, పర్యావరణ విధానాలను వ్యతిరేకిస్తూ.. ఒక రాజకీయ వ్యంగ్య నిరసనగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో ట్రంప్ నగ్నంగా, ఒక చేతిలో గోల్ఫ్ స్టిక్, మరో చేతిలో త్రాసు పట్టుకుని ఉన్నాడు. బాగా బక్క చిన్న సామాన్య వ్యక్తి భుజాలపై ట్రంప్ కూర్చున్నట్లుగా ఆ విగ్రహాన్ని రూపొందించారు. ప్రపంచాన్ని సూచించే విధంగా ఆ వ్యక్తి కింద ఒక గ్లోబ్‌ ఉంది. విగ్రహం పీఠంపై ‘ది కింగ్ ఆఫ్ ఇన్ జస్టిస్’ (అన్యాయానికి రాజు) అని రాసి ఉంది. దానిపైన ‘‘నేను ఒక మనిషి వీపుపై కూర్చున్నాను. నా భారంతో అతడు కుంగిపోతున్నాడు. అతనికి సహాయం చేయడానికి నేను ఏమైనా చేస్తాను. ఆయన వీపు దిగడం తప్ప’’ అని ట్రంప్ అంటున్నట్లుగా రాశారు.

Also Read: ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

ట్రంప్ విధానాలు నచ్చకే..

Advertisement

ఈ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు కళాకారుడు జెన్స్ గాల్సియోట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘డోనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రపంచ ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్నాయి. వాతావరణ మార్పుల పోరాటానికి, అంతర్జాతీయ నియమ నిబంధనలకు పెద్ద ముప్పుగా మారాయి. దీనికి వ్యతిరేకంగా ప్రపంచం ఐక్యంగా నిలబడాలనే సందేశాన్ని ఇవ్వడానికే.. ఈ శిల్పాన్ని రూపొందించినట్లు తెలిపారు. స్ట్రాస్ బర్గ్‌లో కొన్ని రోజులపాటు ఈ విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత నవంబర్‌లో టర్కీలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (COP31) లో కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

Tags

Related News

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

చమురు బాంబు పేల్చిన ట్రంప్.. పతనమైన స్టాక్‌మార్కెట్లు, ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?

అమెరికా చదువులు ఖరీదు బాబోయ్.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ ఝలక్, ఇకపై రూ. 67 లక్షలు

చేప వలలతో పాకీ సైన్యం సరికొత్త ప్రయోగం.. నవ్వుతున్న జనం

కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!

ఆ 5000 మంది ఏమైపోయారు? ఇక వెతకలేక చేతులెత్తేసిన నేపాల్!

ఫ్లైదుబాయ్ కో-పైలట్.. విచారణలో కీలక విషయాలు, షాకైన అధికారులు

Big Stories

Advertisement
×