Papaya Face Mask: తెల్లగా, అందంగా మెరిసిపోతూ ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా మంది బయట మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలికంగా ముఖం తెల్లగా మారినప్పటికీ అంతగా ఫలితం మాత్రం ఉండదు. అంతే కాకుండా వీటిని రకరకాల రసాయనాలతో తయారు చేస్తారు. తరుచుగా వీటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నేచురల్ స్కిన్ కేర్ పాటించాలి.
అందమైన ముఖం కోసం హోం రెమెడీస్ వాడటం మంచిది. బొప్పాయి చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోస్ బొప్పాయిని ఎలా వాడాలి ? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయితో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లు ముఖం కాంతిని పెంచడంలో సహాయపడతాయి. వేర్వేరు బొప్పాయి ఫేస్ మాస్క్‌లు వివిధ చర్మ రకాలకు ప్రభావవంతంగా ఉంటాయి.
బొప్పాయి ఫేస్ మాస్క్ ప్రయోజనాలు:
బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. అనేక వ్యాధుల నుంచి కాపాడే బొప్పాయి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి నుండి తయారుచేసిన ఫేస్ మాస్క్‌లు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, వివిధ పదార్థాలను మిక్స్ చేసి తయారుచేసిన బొప్పాయి ఫేస్ ప్యాక్ వివిధ రకాల చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బొప్పాయి చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. బొప్పాయి నుండి ఫేస్ మాస్క్‌లను తయారుచేసే కొన్ని మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.బొప్పాయితో ఫేస్ మాస్క్:
కావలసినవి:
పండిన బొప్పాయి పేస్ట్ – 1/2 కప్పు
పెరుగు – 2 స్పూన్లు
తేనె – 1 స్పూన్
తయారీ విధానం:
బొప్పాయి పేస్ట్ తీసుకుని అందులో పెరుగు, తేనె కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు పోవడానికి ఈ ఫేస్ మాస్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. ఆయిల్ స్కిన్ కోసం బొప్పాయి ఫేస్ మాస్క్:
కావలసినవి:
పండిన బొప్పాయి – 1/4 కప్పు
నిమ్మరసం – 1 టీస్పూన్
చందనం పొడి – 1 టీస్పూన్
తయారీ విధానం:
బొప్పాయి పేస్ట్‌లో నిమ్మరసం,చందనం పొడి వేసి మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ మాస్క్ ముఖంపై ఉన్న మురికిని తొలగించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
3.మొటిమలకు బొప్పాయి ఫేస్ మాస్క్:
కావలసినవి:
పండిన బొప్పాయి పేస్ట్ – 1/4 కప్పు
పెరుగు – 2 టీస్పూన్లు
పసుపు – చిటికెడు
తయారీ విధానం:
పైన చెప్పిన మోతాదులో బొప్పాయి పేస్ట్ తీసుకుని అందులో పెరుగు,పసుపు వేసుకుని మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. తరుచుగా ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
4. డ్రై స్కిన్ కోసం బొప్పాయి ఫేస్ మాస్క్:
కావలసినవి:
పండిన బొప్పాయి పేస్ట్ – 1/4 కప్పు
అలోవెరా జెల్ – 1 టీస్పూన్
బాదం నూనె – కొన్ని చుక్కలు
తయారీ విధానం:
ముందుగా పైన చెప్పిన మోతాదులో బొప్పాయి పేస్ట్ తీసుకుని అందులో అలోవెరా జెల్ , బాదం నూనె కలపండి. తర్వాత దీనిని
ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది.
బొప్పాయి ఫేస్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
మృత చర్మ కణాలను తొలగిస్తుంది.
చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
మొటిమలను తగ్గిస్తుంది.
చర్మానికి పోషణనిస్తుంది.
Also Read: ఈ ఆయిల్ ఒక్క సారి వాడినా చాలు.. జుట్టు ఒత్తుగా పెరగడం గ్యారంటీ
సూచనలు:
బొప్పాయి అంటే అలెర్జీ ఉంటే.. ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
మీ చర్మం సున్నితంగా ఉంటే, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి.
ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.
ఫేస్ మాస్క్ తొలగించిన తర్వాత.. చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.