Homemade Hair Oil: పొడవైన, మందపాటి జుట్టును ఎవరు ఇష్టపడరు చెప్పండి ? అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే, ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. అయితే నేటి కాలంలో అలాంటి జుట్టును కోరుకోవడం కాస్త కష్టంగా మారుతోంది. నేడు, జుట్టు సంబంధిత సమస్యలు ముఖ్యంగా జుట్టు రాలడం చాలా సాధారణమైపోయింది.
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మార్కెట్లో చాలా ఖరీదైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రొడక్ట్స్ జుట్టుకు అస్సలు పని చేయవు. ఇదిలా ఉంటే సామాన్యుడి బడ్జెట్‌కు మించినవి. కానీ కొన్ని రకాల హోం మేడ్ హెయిర్ ఆయిల్స్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఇదిలా ఉంటే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉల్లిపాయలతో పాటు లవంగాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని జుట్టు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసినవి:
కొబ్బరి నూనె- 100 గ్రాములు
ఆవాల నూనె- 2 – 3 స్పూన్లు
బాదం నూనె- 2- 3 స్పూన్లు
మెంతి గింజలు- 2 చెంచాలు
లవంగాలు- 7- 8
ఉల్లిపాయలు- ఒక చిన్న కప్పు
తయారీ విధానం: ముందుగా గ్యాస్ పై ఒక మందపాటి గిన్నెను పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. కొబ్బరి నూనె కాస్త వేడి అయ్యాక ఆవాల నూనెతో పాటు బాదం నూనె వేసి మరగనివ్వాలి. తర్వాత అందలోనే మెంతి గింజలు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మరగనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఆయిల్ రంగు పూర్తిగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్‌ను వడకట్టాలి. తర్వాత ఈ ఆయిల్‌ను ఒక గాజు గ్లాసులో పోసి స్టోర్ చేసుకోవాలి.
Also Read: ఇలా చేస్తే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం
ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత 30 నిమిషాల తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బయట మార్కెట్ లో రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ వాడటం వల్ల జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంటుంది. అంతే కాకుండా వీటికి ఎక్కువగా ఖర్చు అవుతుంది కూడా. అందుకే హోం మేడ్ హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకుని వాడటం మంచిది . వీటి వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.