Rahul Soreng – Virender Sehwag: 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడి ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిలో (అవంతిపుర) సమీపంలో భారత సైనికులను తీసుకువెళుతున్న వాహనాలపై పక్కా వ్యూహంతో పాకిస్తాన్ ఉగ్రవాదులు కారుతో ఆత్మహుతి బాంబు దాడి చేశారు ఈ ఘటనలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సిఆర్పిఎఫ్) సైనికులు, ఓ ఉగ్రవాది మరణించారు. దాడి అనంతరం పాకిస్తాన్ లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్ – ఏ – మొహమ్మద్ ఈ దాడి చేసినట్లుగా ప్రకటించింది.
Also Read: Team India WTC Schedule: WTC 2025-2027 టోర్నమెంట్ టీమిండియా షెడ్యూల్ ఇదే ?
దాడి చేసిన వ్యక్తిని కాశ్మీర్ కి చెందిన ఆదిల్ అహ్మద్ గా గుర్తించారు. అమర జవాన్ల త్యాగానికి నివాళిగా పలువురు ప్రముఖులు సైనికుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక ఈ పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లలోని కొందరు పిల్లలకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ {Rahul Soreng – Virender Sehwag} తన అంతర్జాతీయ క్రికెట్ స్కూల్ లో శిక్షణ ఇస్తానని మాట ఇచ్చాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తనకు చేతనైనంత మేర రుణం తీర్చుకుంటానని పేర్కొన్నాడు.
వారి పిల్లలను ప్రయోజకులను చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపాడు. ఇచ్చిన మాట ప్రకారం వీరేంద్ర సెహ్వాగ్ {Rahul Soreng – Virender Sehwag} తన మాటను నిలబెట్టుకున్నాడు. బుధవారం ఎక్స్ వేదికగా సెహ్వాగ్ ఓ ట్వీట్ చేసి భావోద్వేగానికి గురయ్యాడు. తమ పాఠశాలలో విద్యనుభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని తెలిపాడు. ఈ రాహుల్ సోరెంగ్ మరెవరో కాదు.. పుల్వామా ఘటనలో నింగికెగసిన అమరుడు, ఝార్ఖండ్ కి చెందిన విజయ్ సోరెంగ్ కుమారుడు. ఇతను సెహ్వాగ్ స్కూల్ లో చదువుతూనే క్రికెట్ లోను శిక్షణ తీసుకున్నాడు.
హర్యానా అండర్ 16 జట్టుకు ఎంపికయ్యాడు. రాహుల్ విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల సెహ్వాగ్ {Rahul Soreng – Virender Sehwag} ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ” నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. పుల్వామా హీరో షాహిద్ విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 2019లో జాయిన్ అయ్యాడు. నాలుగేళ్ల పాటు ఇదే పాఠశాలలో విద్యనభ్యసించాడు. అతను విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్ 16 హర్యానా టీమ్ కి ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మన వీర జవాన్లకు కృతజ్ఞతలు” అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ వీర జవాన్ కుమారుడు విజయ్ మర్చంట్ ట్రోఫీలో రాణించి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అడుగు పెట్టాలని కోరుకుందాం.
Remember the Name- Rahul Soreng. This is one of the happiest feelings in life. After the tragic Pulwama attack, had made an appeal to offer free education to children of our martyr’s study and stay in my @sehwagschool . I feel so privileged that Rahul Soreng , son of Pulwama… https://t.co/gKvrcyy767 pic.twitter.com/L0Qlc1hh3j
— Virender Sehwag (@virendersehwag) December 18, 2024