BigTV English

Almonds: ఈ 5 ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. బాదం అస్సలు తినకూడదు

Almonds: ఈ 5 ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. బాదం అస్సలు తినకూడదు

Almonds: బాదం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో అందరికీ తెలిసిందే. అందుకే రోజు కొన్ని బాదంపప్పులను నమలడం చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్, కాల్షియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక పోషకాలు బాదంపప్పులో ఉంటాయి. ఇవి మన శారీరక , మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఆహారంలో బాదంపప్పును క్రమం తప్పకుండా చేర్చుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు.


బాదం అన్ని విధాలుగా లాభదాయకంగా కనిపించినప్పటికీ, కొంతమందికి హానికరం కూడా కావచ్చు. అవును, బాదంపప్పును తీసుకోవడం ద్వారా రోగి మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ వ్యక్తులు బాదంపప్పును తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీతో సహా ఈ 5 జబ్బులు ఉన్న వారు పొరపాటున కూడా బాదంపప్పు తినకండి. మీ ఆరోగ్యానికి విషం లాగా పనిచేస్తాయి.బాదం పప్పు తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినప్పటికీ కొన్ని వ్యాధులు ఉన్న వారు బాదంపప్పుల వినియోగాన్ని నివారించాలి. ఎందుకంటే అవి మీ సమస్యలను మరింత పెంచుతాయి. మరి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బాదం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.


అధిక రక్తపోటు రోగులు:
అధిక రక్తపోటు ఉన్నవారు బాదంపప్పును పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి. నిజానికి బాదంపప్పులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును సాధారణీకరించే మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు మందులతో పాటు బాదంపప్పును తింటుంటే అది మీకు హానికరం.

కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు:
మీరు తరచుగా గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి కొన్ని కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే బాదంపప్పును పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి. నిజానికి బాదంపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీ జీర్ణశక్తి బలహీనంగా ఉంటే.. మీరు దానిని జీర్ణం చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. అదనంగా, గ్యాస్, ఉబ్బరం, అతిసారం, కడుపు నొప్పి వంటి సమస్యలు మరింత పెరగే ప్రమాదం కూడా ఉంది. అందుకే మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో బాదంను భాగంగా చేసుకోవడం మంచిది.

స్థూలకాయంతో బాధపడేవారు:
పెరుగుతున్న బరువు గురించి ఆందోళన చెందే వ్యక్తులు తమ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోకుంటనే మంచిది.నిజానికి బాదంలో కొవ్వు , కేలరీల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని బాదంపప్పులు మీ కొవ్వును వేగంగా పెంచడంలో సహాయపడతాయి. మీరు స్థూలకాయంతో పోరాడుతున్నట్లయితే, దానిని త్వరగా తగ్గించుకోవాలనుకుంటే మాత్రం బాదంపప్పును చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే తినండి.

కిడ్నీ స్టోన్ రోగులు:
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి బాదం తినడం వల్ల ప్రయోజనం కాకుండా హాని కలుగుతుంది. వాస్తవానికి, ఆక్సలేట్ అనే సమ్మేళనం బాదంలో అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరచడంలో సహాయపడుతుంది. మీకు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే, ప్రతిరోజు బాదం తినడం వల్ల రాళ్ల పరిమాణం పెరుగుతుంది. మీ వైద్యుడిని సంప్రదించకుండా బాదంపప్పును తీసుకోకూడదు.

Also Read: శరీరంలో ప్రొటీన్ లోపిస్తే.. కనిపించే లక్షణాలు !

మైగ్రేన్‌తో బాధపడుతున్న వ్యక్తులు:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మైగ్రేన్‌తో బాధపడేవారు కూడా బాదంపప్పు తీసుకోవడం తగ్గించాలి. ఒకవేళ ఈ సమస్య బాగా పెరిగిపోయినట్లయితే డాక్టర్ సలహా లేకుండా మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోకూడదు. నిజానికి బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది తలనొప్పి, తల తిరగడం, వాంతులు , అలసట వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×