OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే మొదటగా గుర్తుకు వచ్చేది మలయాళం మూవీస్. ఈ సినిమాలు ఎక్కువగా సస్పెన్స్ తోనే నడుస్తాయి. ఈమధ్య ఈ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video)
ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు. ‘సోలోమోంటే తేనీచకల్‘ (Solamante Theneechakal). ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి లాల్ జోస్ దర్శకత్వం వహించారు. ప్రొడక్షన్ హౌస్ LJ ఫిల్మ్స్ ద్వారా లాల్ జోస్ నిర్మించిన ఈ మూవీలో జోజు జార్జ్, దర్శన S. నాయర్, విన్సీ అలోషియస్ శంభు మీనన్ నటించారు. విద్యాసాగర్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
సుజి ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటుంది. ఈమెకి లానా అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఒకరోజు లానా తాను వెళ్ళేదారిలో రోమియోల బెడద ఎక్కువగా ఉందంటూ సుజికి చెప్తుంది. ఈ క్రమంలో వాళ్లని పట్టుకోవడానికి సుజీ మారువేషంలో వెళ్తుంది. అక్కడ శరత్ అనే యువకుడ్ని పట్టుకుంటుంది. నిజానికి అతడు రోమియో కాదు, జస్ట్ సుజితో పిన్ అవసరం ఉండి మాట్లాడుతాడు అంతే. ఇలా అతన్ని అనవసరంగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. ఆ తర్వాత నిజం తెలుసుకొని ఇద్దరూ మాటల్లో పడతారు. వీరి మాటలు ప్రేమకు దారితీస్తాయి. అయితే పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేసే వ్యక్తి సుజీని ప్రేమించవలసిందిగా టార్చర్ చేస్తాడు. ఇది చూసి శరత్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. ఆ మరుసటి రోజు పోలీస్ ఆఫీసర్ రక్తపు మడుగులో చనిపోతాడు. సుజీ ఈ మర్డర్ చేసింది శరత్ అనుకొని భయపడుతుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి శరత్ కూడా కనిపించకుండా పోతాడు.
మరోవైపు ఆ పోలీస్ స్టేషన్ కి కొత్తగా సాల్మన్ అనే ఇన్స్పెక్టర్ వస్తాడు. ఈ మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషిని పట్టుకొని కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఆ పనిమనిషికి చనిపోయిన పోలీస్ ఆఫీసర్ కి సంబంధం ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ కూడా ఒకసారి గొడవ జరుగుతుంది. సాల్మన్ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో కొన్ని విషయాలను వెలుగులోకి తెస్తాడు. చివరికి సాల్మన్ ఈ కేసును సాల్వ్ చేస్తాడా? పోలీస్ ఆఫీసర్ని ఎవరు హత్య చేస్తారు? శరత్ ఎందుకు కనపడకుండా పోతాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళం మూవీని తప్పకుండా చూడండి.