Hair Growth Tips: సమ్మర్‌లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లే.. జుట్టును కూడా అదే విధంగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని సార్లు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, తలస్నానం చేసిన మరుసటి రోజే జిడ్డుగా మారుతుంది.
తలపై చర్మం జిడ్డుగా ఉన్న వారికి ఇలా జరుగుతుంది. అంతే కాకుండా తలలో సెబమ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు కూడా తరచుగా జుట్టు జిడ్డుగా మారుతుంది. అధిక సెబమ్ కారణంగా.. జుట్టు చాలా పొడిగా కూడా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితిలో సమ్మర్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే మీరు ప్రతిరోజూ తలస్నానం చేయలేరు. అందుకే జుట్టుపై జిడ్డు పేరుకుపోకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించండి.
సరైన షాంపూ వాడండి:
సమ్మర్‌లో మీరు సరైన షాంపూ వాడితే.. మీ జుట్టు చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో.. జిడ్డుగా తయారైన జుట్టు కోసం మంచి షాంపూలను ఉపయోగించాలి. ఇవి జుట్టులో ఉత్పత్తి అయ్యే అదనపు సెబమ్‌ను నియంత్రిస్తాయి.
ఈ అంశాలు షాంపూలో ఉండకూడదు:
మీరు షాంపూ కొన్నప్పుడల్లా.. అందులో ఉండే పదార్థాల గురించి ఒకసారి చదవండి. సమ్మర్‌లో ఉపయోగించే షాంపూలలో సల్ఫేట్ , పారాబెన్ లేకుండా చూసుకోండి. అలాంటి షాంపూలు మాత్రమే మీ జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి వీటిని మాత్రమే ఉపయోగించండి.
జుట్టుకు కండిషనర్ రాయండి:
మీరు కండిషనర్ ఉపయోగిస్తే.. దానిని జుట్టు చివర్లకు మాత్రమే రాయండి. తలకు ఎప్పుడూ కండిషనర్ వాడకండి. ఇది తలపై చర్మాన్ని తేమగా చేస్తుంది. దీనివల్ల జుట్టు మరింత జిగటగా మారుతుంది.
డ్రై షాంపూ వాడండి:
చాలా మంది తలస్నానం చేసిన మరుసటి రోజే జుట్టు అంటుకోవడం ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో.. మీరు మంచి షాంపూని ఉపయోగించవచ్చు. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత షాంపూను ఎంపిక చేసుకోండి.
Also Read: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్‌తో ప్రాణాలకే ప్రమాదం.. పరిశోధనల్లో షాకింగ్ నిజాలు
హెయిర్ బ్రష్‌ను శుభ్రంగా ఉంచండి:
మీ జుట్టు చాలా జిగటగా ఉండకూడదనుకుంటే.. మీ హెయిర్ బ్రష్ , దువ్వెనను శుభ్రంగా ఉంచండి. మురికి హెయిర్ బ్రష్ వల్ల బ్యాక్టీరియా, నూనె తిరిగి జుట్టులోకి వస్తాయి. కాబట్టి.. కనీసం వారానికి ఒకసారి దానిని పూర్తిగా శుభ్రం చేయండి.