Lukewarm Water: చలికాలంలో చాలా మంది రోజును గోరువెచ్చని నీటిని త్రాగడంతో ప్రారంభిస్తారు. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. గోరువెచ్చని నీరు అందరికీ మేలు చేస్తుందనేది మాత్రం అస్సలు నిజం కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది. దీని వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి.
మీరు క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిని తాగుతున్నట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. కొన్ని శారీరక సమస్యలు ఉన్న వారు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు గోరు వెచ్చని నీళ్లు త్రాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సంబంధిత సమస్యలు: అల్సర్లు, అసిడిటీ లేదా IBS వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీటిని తాగడం మానుకోవాలి. ఇది వారి సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది.
కిడ్నీ సమస్యలు ఉన్న వారు: కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక మొత్తంలో వేడి నీటిని తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా సమస్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
గుండె జబ్బులు: గుండె జబ్బులు ఉన్నవారు కూడా వేడి నీటిని తాగడం పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది.
బర్నింగ్ సెన్సేషన్: వేడి నీటిని తాగిన తర్వాత మీ నోటిలో లేదా గొంతులో మంటగా అనిపిస్తే, మీరు తక్కువ వేడిగా లేదా చల్లగా ఉన్న నీటిని మాత్రమే త్రాగాలి.
జ్వరం: జ్వరంలో శరీర ఉష్ణోగ్రత అప్పటికే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వేడి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.
ప్రెగ్నెన్సీ: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు వేడినీళ్లు తాగడం వల్ల కడుపులోని బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ ఉన్న వారు
ఎందుకు తాగకూడదు ?
కడుపులో చికాకు: వేడి నీరు కడుపులో ఆమ్లతను పెంచి చికాకు కలిగిస్తుంది.
మూత్రపిండాలపై ఒత్తిడి: వేడినీరు మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
శరీర ఉష్ణోగ్రత పెరుగుదల: జ్వరం వచ్చినప్పుడు వేడినీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.
ఇతర ఆరోగ్య సమస్యలు: వేడి నీటిని తాగడం వల్ల కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా హాని కలుగుతుంది.
Also Read: ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు.. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిని ఎప్పుడు త్రాగాలి ? ఎంత మోతాదులో తాగాలి ?
ఉదయాన్నే పడగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి శరీరం డిటాక్సిఫై అవుతుంది.
ఆహారం తిన్న గంట తర్వాత: ఆహారం తిన్న గంట తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.
ఒక వ్యక్తి ఎంత తాగాలి: రోజుకు 2-3 లీటర్ల నీరు త్రాగాలి.