Delhi Rains: ఢిల్లీలో వాతావరణం ఈ ఉదయం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది. ముఖ్యంగా లజ్‌పత్ నగర్, ఆర్‌కే పురం, లోధి రోడ్, ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా పడుతుంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
వాతావరణ మార్పుతో ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయి. నగరంలోని ఉష్ణోగ్రతలను సాధారణ స్థాయిలో ఉండనున్నాయి. అయితే, వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తెలిత్తే అవకాశముంది. అందుకే ఈ రోజు బయటకు వెళ్ళే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
నగరంలో వర్షం కురిసినప్పటి నుంచే రోడ్లపై వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ముఖ్యంగా లోధి రోడ్, ఆర్‌కే పురం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆలస్యం అవుతోంది. బస్సులు, మెట్రో సర్వీసులు కూడా ఈ పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వర్షం ఎక్కువ కురిసే ప్రాంతాల్లో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అదికారులు సూచించారు. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళాలని హెచ్చారికలు జారీ చేశారు.
వాహనాలు మితిమీరి వేగంతో నడవకూడదు, ముఖ్యంగా నీటి నిల్వలు ఉన్న రోడ్లలో అని తెలిపారు. విద్యుత్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేస్తున్నాయా అని గమనించటం కూడా అవసరం అని తెలిపారు. రాజధాని లో వర్షం వల్ల కొన్ని అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలకు ఇమెర్జెన్సీ నంబర్లు గుర్తుంచుకోవడం, ప్రమాదాలు సంభవించే ప్రాంతాల నుండి దూరంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
ఢిల్లీలో భారీ వర్షాలు
ఈ ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
లజ్‌పత్ నగర్, ఆర్‌కే పురం, లోధి రోడ్, ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలలో భారీ వర్షాలు
ఢిల్లీలో ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్… pic.twitter.com/0TE6xUpvaT
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2025