Dandruff : చుండ్రు అనేది తలలో దురద, పొడిబారడం, చర్మం పొరలుగా ఊడిపోవడం వంటి లక్షణాలతో కూడిన ఒక సాధారణ సమస్య. ఇది కేవలం సౌందర్యపరమైన సమస్య మాత్రమే కాదు, ఒక్కోసారి అసౌకర్యానికి ఇబ్బందికి కూడా దారితీస్తుంది. చుండ్రు సాధారణంగా మాలాసెసియా గ్లోబోసా అనే ఫంగస్ వల్ల లేదా పొడి చర్మం, జిడ్డు చర్మం, సరిపడా శుభ్రం చేసుకోకపోవడం, కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల కూడా వస్తుంది.
పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది ఒక్కోసారి కష్టం కావచ్చు. ఎందుకంటే చర్మ తత్వం, వాతావరణం వంటివి కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. అయితే.. ఇంట్లో లభించే సహజసిద్ధమైన పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే చుండ్రు సమస్యను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. అంతే కాకుండా మళ్లీ తిరిగి రాకుండా జాగ్రత్తపడొచ్చు.
చుండ్రును తగ్గించడానికి హోం రెమెడీస్:
1. టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్‌లో బలమైన యాంటీ ఫంగల్ , యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. అందుకే ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
వాడకం: మీరు వాడే షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి తలస్నానం చేయండి. లేదా.. ఏదైనా క్యారియర్ ఆయిల్ (కొబ్బరి నూనె)లో కొన్ని చుక్కలు కలిపి తలకు పట్టించి.. ఒక గంట తర్వాత షాంపూతో శుభ్రం చేయండి.
2. వేప ఆకులు :
వేప యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది చుండ్రును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వాడకం: కొన్ని వేప ఆకులను నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ నీటిని చల్లార్చి.. తలస్నానం చేసిన తర్వాత చివరిగా ఈ నీటితో తలను శుభ్రం చేయండి. లేదా, వేప ఆకులను పేస్ట్‌గా చేసి తలకు పట్టించి 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
3. నిమ్మకాయ జ్యూస్:
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ తల pH సమతుల్యతను సరిచేసి, చుండ్రును తగ్గిస్తుంది.
వాడకం: 2 టేబుల్‌స్పూన్ల నిమ్మరసాన్ని తలకు పట్టించి.. 5-10 నిమిషాలు మసాజ్ చేయండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. దీని తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు కూడా నల్లగా మెరుస్తూ ఉంటుంది.
4. పెరుగు :
పెరుగులో ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి తలపై చర్మానికి పోషణనిచ్చి, చుండ్రును తగ్గిస్తాయి.
వాడకం: పుల్లని పెరుగును తలకు, ముఖ్యంగా కుదుళ్లకు బాగా పట్టించండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత షాంపూతో శుభ్రం చేయండి.
5. మెంతులు :
మెంతులలో యాంటీఫంగల్ , యాంటీ బాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి చుండ్రును తగ్గించి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
వాడకం: 2-3 టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం వాటిని మెత్తగా రుబ్బి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి 30-45 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత తలస్నానం చేయండి.
Also Read: ఈ హోం మేడ్ డ్రింక్స్ తాగితే.. ఈజీగా వెయిట్ లాస్ !
6. ఆపిల్ సైడర్ వెనిగర్ :
ACV తల pH స్థాయిని సమతుల్యం చేసి, చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ పెరుగుదలను నిరోధిస్తుంది.
వాడకం: ఒక కప్పు నీటిలో సగం కప్పు ACV కలిపి.. తలస్నానం చేసిన తర్వాత చివరిగా ఈ మిశ్రమంతో తలను శుభ్రం చేయండి కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో తలస్నానం చేయండి..