Prithvi Shaw : టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీషా ఇటీవలే ఓ కీలకం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవాళి క్రికెట్ లో అతను ఇక పై ముంబై జట్టుకి ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. వేరే జట్టుకు మారేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ ను అతడు అభ్యర్థించాడు. గత కొంత కాలం నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్ తో అతనికి విభేదాలు తలెత్తాయి. అందుకు ప్రధాన కారణం అతనిడి జట్టు నుంచి తప్పించడమే. ఫిట్ నెస్ సరిగ్గా లేకపోవడంతో గత ఏడాది రంజీ ట్రోఫీ జట్టు నుంచి ముంబై సెలెక్టర్లు పక్కన పెట్టారు. షా శరీరంలో అధికంగా ఫ్యాట్ ఉందని.. బరువు ఎక్కువగా ఉన్నాడని ముంబై టీమ్ మేనేజ్ మెంట్ సెలక్టర్లకు ఫిర్యాదు చేసింది. దీంతో పృథ్వీషా వేరే జట్టుకు మారాలనుకున్నాడు. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పృథ్వీ షా క్రికెట్ కి గుడ్ బై చెప్పి ఫుట్ బాల్ ఆడుతున్నట్టు ఓ వార్త వినిపిస్తోంది.
ఫిట్ నెస్ కోల్పోవడంతోనే..
వాస్తవానికి ఈ యంగ్ బ్యాటర్ పృథ్వీ షా తన కెరీర్ ప్రారంభంలో అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో టీమిండియాలో కీలక ఆటగాడుగా మారడం పక్కా అని మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసించారు. ఇక ఆ తరువాత పేలవ ప్రదర్శన.. ఫిట్ నెస్ కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం కౌంటీ దేశవాలీ క్రికెట్ మ్యాచ్ ల్లో ఆడుతున్నప్పటికీ టీమిండియా లో మాత్రం చోటు చాలా కష్టంగా మారింది. మరోవైపు ఐపీఎల్ లో కూడా అన్ సోల్డ్ గా మిగిలిపోవడం గమనార్హం. అప్పుడప్పుడు కాంట్రవర్సిల్లో చిక్కుకోవడంతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. పృథ్వీ షా జెర్సీతో ఫుట్ బాల్ టీమ్ లో మరో వ్యక్తి కనిపించాడు. మాంచెస్టర్ లో టీమిండియా ప్లేయర్లు కూడా ప్రాక్టీస్ కోసం ఫుట్ బాల్ ఆడారు. దీంతో పృథ్వీ షా ఫుట్ బాల్ ఆడుతున్నాడా..? అని నెటిజన్స్ కామెంట్స్ చేయడం విశేషం.
తప్పిదాలను అంగీకరించా : పృథ్వీ షా
తాజాగా ఓ స్పోర్ట్స్ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కెరీర్ తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటపై దృష్టి పెట్టకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. “కెరీర్ లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. క్రికెట్ కి తక్కువ సమయం ఇస్తున్నానని అర్థమైంది. అయితే 2023 వరకు నేను రోజులో సగం సమయం మైదానంలోనే ఉండేవాడిని. కానీ ఆ తరువాత కొన్ని చెడు విషయాల వైపు వెళ్లాను. కొంత మంది తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. అయితే కెరీర్ లో మనం సక్సెస్ అయినప్పుడు చాలా మంది స్నేహితులు మన దగ్గరకు వస్తారు. నాకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో అంతకు ముందు రోజులో 8 గంటలు గ్రౌండ్ లో ఉండే నేను.. కొత్త పరిచయాల ద్వారా 4 గంటలే గడిపాన. అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మా తాతాయ్య చనిపోయారు. ఆయన మరణంతో చాలా కుంగిపోయాను. ఆ తరువాత చాలా జరిగాయి. నా తప్పిదాలను నేను అంగీకరించా” అని పృథ్వీ షా వెల్లడించాడు.
Know More: https://t.co/959y0to5kd pic.twitter.com/RzOXziNxBI
— CricketGully (@thecricketgully) July 22, 2025