BigTV English

Potato For Skin: బంగాళదుంపతో ఈ ఒక్కటి కలిపి వాడితే.. తెల్లగా మెరిసిపోతారు

Potato For Skin: బంగాళదుంపతో ఈ ఒక్కటి కలిపి వాడితే.. తెల్లగా మెరిసిపోతారు

Potato For Skin: కూరల్లో బంగాళ దుంపలను వాడటం వల్ల దాని రుచి చాలా రెట్లు పెరుగుతుంది. కూరగాయలు తయారు చేయడంతో పాటు బంగాళ దుంపలను స్నాక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటితో తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, కట్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.


కానీ తక్కువ ధరకు లభించే ఈ బంగాళ దుంప ముఖం మెరిసేలా చేయడంలో సహాయపడుతుందని మీకు తెలుసా? ఇందులో ఉండే ఎంజైమ్‌లు, విటమిన్ సి, స్టార్చ్ చర్మాన్ని ప్రకాశవంతంగా.. శుభ్రంగా, తాజాగా మారుస్తాయి. మచ్చలు తగ్గించడంలో కూడా ఉపయోగ పడతాయి. ఇంతకీ గ్లోయింగ్ స్కిన్ కోసం బంగాళ దుంపను ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖానికి బంగాళ దుంపను ఎలా వాడాలి ?


బంగాళ దుంప రసం:
వినడానికి వింతగా అనిపిస్తుంది. కానీ బంగాళదుంప రసం ముఖానికి ఉపయోగించడం ద్వారా మీ ముఖాన్ని ప్రకాశవంతం చేసుకోవచ్చు. దీని కోసం.. ముందుగా ఒక బంగాళదుంపను తురిమి జ్యూస్ తీయండి. ఇప్పుడు ఈ జ్యూస్‌ను కాటన్ సహాయంతో మీ ముఖం మీద అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇది మీ ముఖం నుండి టానింగ్‌ను కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని తెల్లగా మారుస్తుంది.

తురిమిన బంగాళ దుంప:
ముఖంపై మచ్చలు ఉంటే తురిమిన బంగాళదుంపతో ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకుని వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని కోసం మీకు 1 చిన్న బంగాళదుంప (తురిమిన), 1 టీస్పూన్ నిమ్మరసం , కొంచెం రోజ్ వాటర్ అవసరం తీసుకోండి. అనంతరం వీటన్నింటినీ బాగా కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఇప్పుడు దానిని మెడ, ముఖం మీద బాగా అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. ఈ ప్యాక్‌ని వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల మొటిమల గుర్తులు, మచ్చలు , సన్ టాన్ క్రమంగా తగ్గుతాయి.

బంగాళదుంప ముక్కలు:
బంగాళదుంపలను ఉపయోగించి మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. దీని కోసం.. మీరు పచ్చి బంగాళదుంపలను సన్నని ముక్కలుగా కోసి.. కళ్ళపై 10-15 నిమిషాలు ఉంచండి. ఈ బంగాళదుంప ముక్కలు కళ్ళ వాపు, నల్లటి వలయాలను తగ్గిస్తాయి. మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు దీన్ని ఉపయోగించండి.

Also Read: ఈ ఫేస్ ప్యాక్స్ వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

బంగాళదుంప రసంతో ఫేస్ మాస్క్:
బంగాళదుంపతో ఫేస్ మాస్క్ తయారు చేయడానికి.. 1 టీస్పూన్ బంగాళ దుంప రసం, 1 టీస్పూన్ స్వచ్ఛమైన తేనె ఉపయోగించండి. ఇప్పుడు ఈ రెండు పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని తేమగా ఉంచి, తిరిగి మెరుపును తెస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యానికి బంగాళ దుంప వాడటం వల్ల కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×