E-Paper
Advertisement

జీడిపప్పు, బాదం అతితక్కువ ధరలో కావాలా? దేశంలోని ఈ ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్ హోల్‌సేల్ మార్కెట్లు

జీడిపప్పు, బాదం అతితక్కువ ధరలో కావాలా? దేశంలోని ఈ ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్ హోల్‌సేల్ మార్కెట్లు
Advertisement

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. గత కొన్ని దశాబ్దాలుగా చాలా భారతీయ కుటుంబాల్లో డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు గణనీయంగా పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది బాదం, జీడిపప్పు, కిస్మిస్ వంటి వాటిని క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. అయితే రిటైల్ దుకాణాల్లో వీటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఇలాంటి సమయంలో హోల్‌సేల్ మార్కెట్లు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఇక్కడ నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంటుంది.

హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు ఎందుకు తక్కువ?

హోల్‌సేల్ వ్యాపారులు ఉత్పత్తులను నేరుగా సరఫరాదారుల నుంచి కొనుగోలు చేస్తారు. మధ్యవర్తుల ఖర్చు తగ్గడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరలలో అందుబాటులో వస్తాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, కిస్మిస్ వంటి అనేక రకాల డ్రై ఫ్రూట్స్ ఒకేచోట లభిస్తాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో ఈ మార్కెట్లలో కొనుగోళ్లు మరింత పెరుగుతాయి.

ఢిల్లీలోని ఖారీ బావోలీ మార్కెట్

Advertisement

ఓల్డ్ ఢిల్లీలో ఉన్న ఖారీ బావోలీ మార్కెట్ ఆసియాలోనే ప్రముఖ మసాలా మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది డ్రై ఫ్రూట్స్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, వాల్‌నట్స్ వంటి ఉత్పత్తులు హోల్‌సేల్ ధరలకు దొరుకుతాయి. దేశం నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు.

ముంబైలో మస్జిద్ బందర్, క్రాఫర్డ్ మార్కెట్

ముంబైలోని మస్జిద్ బందర్, క్రాఫర్డ్ మార్కెట్లు డ్రై ఫ్రూట్ వ్యాపారానికి ముఖ్య కేంద్రాలు. ఇక్కడ దేశీయ రకాల డ్రై ఫ్రూట్స్‌తో పాటు, దిగుమతి చేసిన అనేక రకాల ఉత్పత్తులు లభిస్తాయి. ముఖ్యంగా పిస్తా, బాదం, అక్రోట్లు, జీడిపప్పు లాంటి ఐటెమ్స్ అతి తక్కువ ధరకే దొరికే అవకాశం ఉంది.

కోల్‌కతాలోని బుర్రాబజార్

Advertisement

బుర్రాబజార్ తూర్పు భారతదేశంలోని పురాతన వ్యాపార కేంద్రాల్లో ఒకటి. డ్రై ఫ్రూట్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వ్యాపారులకు ఇది ప్రముఖ గమ్యస్థానం. మంచి నాణ్యతతో పాటు పోటీ ధరలు కూడా ఈ మార్కెట్ ప్రత్యేకత.

చెన్నైలో కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లలో కోయంబేడు ఒకటి. ఇక్కడ వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ భారీ పరిమాణంలో విక్రయించబడతాయి. క్వాలిటీ ఐటెమ్స్ సరసమైన ధరలకు వస్తువులు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్‌లో బేగంబజార్

బేగంబజార్ డ్రై ఫ్రూట్స్‌కు ప్రసిద్ధి చెందిన వ్యాపార ప్రాంతం. స్థానిక, దిగుమతి చేసిన ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. కొనుగోలు చేసే ముందు వివిధ దుకాణాల్లో ధరలు పోల్చుకునే అవకాశం ఉండటం వినియోగదారులకు ప్రయోజనకరం.

ఢిల్లీలో చాందినీ చౌక్, లజపత్ రాయ్ మార్కెట్

చాందినీ చౌక్, లజపత్ రాయ్ మార్కెట్లు కూడా డ్రై ఫ్రూట్స్ కొనుగోలుకు మంచి ఆప్షన్లు. పండుగలు, వివాహాల సమయంలో ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి ఆకర్షణీయమైన ధరలు దొరికే అవకాశం ఉంది.

Also Read: ఏ పర్‌ఫ్యూమ్ కొనాలి? బాటిల్‌పై ఉండే ఈ 3 సూచనలు చూసి కొనండి

జైపూర్‌లో ఆదినాథ్ ట్రేడింగ్ కంపెనీ

జైపూర్‌లోని ఆదినాథ్ ట్రేడింగ్ కంపెనీ నాణ్యమైన డ్రై ఫ్రూట్స్‌కు ప్రసిద్ధి చెందింది. బాదం, జీడిపప్పు, కిస్మిస్‌తో పాటు ఇతర దేశీయ, దిగుమతి ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయి. ధరలు హోల్‌సేల్ మార్కెట్లకు సమానంగా ఉండటంతో చాలామంది ఇక్కడ కొనుగోలు చేస్తారు.

డ్రై ఫ్రూట్స్‌ను సరసమైన ధరలకు కొనాలనుకునే వారికి భారతదేశంలో అనేక మంచి హోల్‌సేల్ మార్కెట్లు ఉన్నాయి. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే మరింత ఆదా చేయవచ్చు. సరైన మార్కెట్‌ను ఎంచుకుని నాణ్యత, ధరలను పోల్చి కొనుగోలు చేయండి.

Related News

వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు!

ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!

ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు విధితో పోరాడి విజయం సాధిస్తారు

తెల్ల జుట్టు ఆరోగ్యానికి మంచిదే.. ఆ ప్రమాదకర వ్యాధి నుంచి రక్షణకు సూచన

కర్రీలో నూనె ఎక్కువైందా? రుచి కాపాడడానికి ఈ 5 టిప్స్

రోజంతా పనిచేసి అలసిపోయారా? కేవలం 15 నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసే 5 రెసిపీలు ఇవిగో

డైట్ సోడా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుదల, త్వరగా వృద్ధాప్యం.. నిజమేనా?

Big Stories

Advertisement
×