BigTV English

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Prawns Masala: రొయ్యల పేరు చెబితేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. రొయ్యలు ఆరోగ్యపరంగా కూడా మంచివే. దీనిలో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. రొయ్యలు వండడం కూడా చాలా సులువు. ఇక్కడ మేము ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఎలా వండాలో ఇచ్చాము. దీన్ని వండితే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు. వేడివేడి అన్నంలో లేదా బిర్యానీలో ఈ రొయ్యల కూర తిని చూడండి. రుచి అదిరిపోతుంది.


రొయ్యల మసాలా కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

రొయ్యలు – కిలో
నిమ్మరసం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కారం – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
పెరుగు – అరకప్పు
ఉల్లిపాయలు – రెండు
టమాటాలు – మూడు
కారం – ఒక స్పూను
పసుపు – ఒక స్పూన్
జీలకర్ర – ఒక స్పూన్
గరం మసాలా పొడి – ఒక స్పూను
నూనె – తగినంత
ధనియాల పొడి – ఒక స్పూను


రొయ్యల మసాలా రెసిపీ

రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో నిమ్మరసం, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెకి బదులు బటర్ వేసుకున్నా టేస్టీ గానే ఉంటుంది. రొయ్యలను అందులో వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో రెండు స్పూన్ల నూనె వేసి జీలకర్రను వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు తరుగును వేయించి అవి రంగు మారేవరకు ఉంచాలి.

అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే టమాటోలను మెత్తగా రుబ్బుకొని ఆ ప్యూరీని కూడా వేసి బాగా కలపాలి. టమోటా ప్యూరీ ఇగురు లాగా ఉడికే దాకా ఉంచుకోవాలి. తర్వాత పెరుగును, గరం మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇగురులాగా అయ్యాక ముందుగా వేయించిన రొయ్యలను అందులో వేసి ఉడికించుకోవాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ రొయ్యల మసాలా కూర రెడీ అయినట్టే. అన్నంతో, రోటి, చపాతీలతో దీని రుచి అదిరిపోతుంది.

Also Read: మటన్ బోన్ సూప్ చేయడం చాలా సులువు, ఇలా చేసుకుని తింటే కాల్షియం లోపం కూడా రాదు

రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చికెన్, మటన్ తో పోలిస్తే రొయ్యలను తినడం వల్ల బరువు కూడా పెరగరు. చేపలు, రొయ్యలు వారానికి ఒకట్రెండు సార్లు తినేందుకు ప్రయత్నించండి. ఇవి ఊబకాయం బారిన పడకుండా కాపాడతాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఎన్నో అందుతాయి. పైగా వీటి రుచి అద్భుతంగా ఉంటుంది.

Tags

Related News

Food: ఖాళీ కడపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Cancer Risk: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్

Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్

Hand Dryer: పరిశుభ్రత పేరుతో అనారోగ్యం.. వామ్మో ఇంత డేంజరా ?

Diabetes health Tips: డయాబెటిస్‌కు సులువైన పరిష్కారం.. ఈ పండు ఆకు నీటిని తాగితే చాలు!

Walking: డైలీ 20 నిమిషాలు నడిస్తే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Food and Age: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !

Food For Better Digestion: భోజనం చేసాక ఇవి తింటే.. జీర్ణ సమస్యలు దూరం

Big Stories

×