Heroine Poorna.. అవును, అవును 2వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఒక్కసారిగా భయపెట్టేసిన ప్రముఖ హీరోయిన్ పూర్ణ (Poorna) ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ మెప్పించింది. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన ఈమె, ఈమధ్య గర్భవతి అయి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి మహిళా కూడా బొద్దుగా తయారవుతూ ఉంటుంది. ముందు ఎలా ఉన్నా సరే ..పెళ్లయ్యాక మాత్రం వారి శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత వారు చేసే కసరత్తులు, తీసుకునే జాగ్రత్తలు కారణంగా సన్నబడి నాజూగ్గా మారుతూ ఉంటారు.
డెలివరీ తర్వాత పూర్తిగా బరువు పెరిగిన పూర్ణ..
అయితే అందరి ఆడవారిలాగే హీరోయిన్ పూర్ణ కూడా డెలివరీ తర్వాత బొద్దుగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు మహేష్ బాబు(Maheshbabu ), త్రివిక్రమ్ (Trivikram)కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి అనే పాటలో నటించే అవకాశం లభించింది. ఒకవైపు పూర్తిగా బరువు పెరిగిపోయింది, మరొకవైపు సూపర్ స్టార్ సినిమాలో అవకాశం.. ఈ రెండింటి మధ్య ఆమె ఆలోచన ఎలా ఉంది అనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది పూర్ణ.
కుర్చీ మడత పెట్టి పాటలో అవకాశం..
పూర్ణ మాట్లాడుతూ.. శేఖర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి కుర్చీ మడత పెట్టి పాటలో డాన్స్ చేయడం కోసం ఆఫర్ ఇచ్చారు. మాస్టర్ నేనిప్పుడు దున్నపోతులా తయారయ్యాను.. ఈ అవతారంలో నేను అసలు డాన్స్ చేయగలను అనుకుంటున్నారా? అని అడిగాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత బరువు బాగా పెరిగిపోయాను. నాపై నేనే అపనమ్మకంతో ఉన్న సమయంలో సినిమా టీం, డైరెక్టర్ నా డాన్స్ కంటే ఎక్స్ప్రెషన్స్ హైలైట్ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్ కి ఒకరోజు ముందే రావాలా అని అడిగితే.. అవును అన్నారు. అయితే సోషల్ మీడియాలో నా ఫోటోలు చూసిన వారు ఏమిటి..? పందిలా తయారయ్యింది..?అంటూ హేళన చేస్తూ కామెంట్లు చేశారు.
ఒక తల్లిని హేళన చేస్తున్నామని ఎందుకు గ్రహించలేదు..
నిజానికి మీరు నన్ను తిట్టినందుకు నేను బాధపడలేదు. కానీ నేను తల్లి అయిన తర్వాత నా శరీర సౌష్టవం లో మార్పులు వచ్చిన తరువాత, ఒక తల్లిని నిందిస్తున్నాము అని ఎందుకు గ్రహించలేకపోతున్నారు..? అంటూ ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది.. ఈ నెగిటివిటీని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాలో కనిపించేందుకు ఒప్పుకోలేదు. కానీ చిత్ర బృందం నన్ను ఎట్టకేలకు ఒప్పించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పందిలా ఉంది అంటూ నన్ను హేళన చేసిన వారే నా పర్ఫామెన్స్ చూసిన తర్వాత నన్ను మెచ్చుకున్నారు. ఇది బెస్ట్ గా నిలిచిపోయింది అంటూ పూర్ణ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే తల్లిని అయిన తర్వాత నిందించడం బాధాకరం అనిపించిందని పూర్ణ తెలిపింది. ఆ తర్వాత తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచి, శభాష్ అనిపించుకుంది. ఇకపోతే ఈ కుర్చీ మడత పెట్టి పాట సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటతో పాటు పూర్ణకి కూడా మంచి పేరు లభించింది.