BigTV English

Winter Traveling  : శీతాకాలం ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Winter Traveling  : శీతాకాలం ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Winter Traveling  : శీతాకాలంలో ఇంట్లో ఉంటేనే జలుబు, జ్వరాలు వస్తుంటాయి. అలాంటిది ప్రయాణమంటే మాటలు కాదు. కొత్త చోటు, పైగా వాతావరణంలో మార్పులతో మనకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పొగమంచుతో విమానాలు, రైళ్లు ఎప్పుడు ఆలస్యమవుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు సమయం వృథా కాకుండా, ట్రిప్ రద్దు కాకుండా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.


సాధ్యమైనంత వరకు ఒకే విమానం లేదా ఒకే రైల్లో ప్రయాణించేలా చూసుకోవాలి. మధ్యలో ఆగకుండా ఒకేసారి గమ్యానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. విమానాల్లో ప్రయాణించేవారికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. నాన్ స్టాప్ ఆప్షన్‌ను ఎంచుకుంటే బెటర్‌. సాధ్యమైనంత వరకు పొద్దున్నే బయలుదేరాలి. చలికాలంలో పొద్దున్నే లావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ వీలైనంత తొందరగా బయలుదేరితే మంచిది.

అంతేకాకుండా మనం వెళ్లబోయే ముందే ఆ ప్రదేశం వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి. పొగమంచు ఎలా ఉండబోతుందో వాతావరణ వివరాల్లో తెలుసుకోవాలి. ఎయిర్‌లైన్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండాలి. చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అందుకే బేసిక్ మందులు.. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి మాత్రలను దగ్గర ఉంచుకుంటే బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు.


డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మందుల కిట్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. స్వెట్టర్లతో పాటు దుప్పట్లను కూడా తీసుకెళ్తే మంచిది. వ్యాజిలైన్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగకూడదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అందుకే మీ నీళ్ల బాటిల్‌ను మీరే తీసుకెళ్లాలంటున్నారు. ప్రదేశం మారితే అక్కడ నీరు కూడా మారుతుంది. దీంతో జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×