BigTV English

Carrots : చలికాలంలో క్యారెట్‌తో మీ స్కిన్‌ను కాపాడుకోండి

Carrots : చలికాలంలో క్యారెట్‌తో మీ స్కిన్‌ను కాపాడుకోండి

Carrots : చలికాలంలో మామూలుగా మన చర్మం పగులుతుంటుంది. కొందరి మాత్రం చర్మం పొడిగా మారి దురదలు కూడా వస్తుంటాయి. చలికాలంలో మన చర్మాన్ని సాఫ్ట్‌గా, తేమగా ఉంచుకోవాలంటే దానికి క్యారెట్ ఎంతో ఉపయోగపడుతుంది. అసలు క్యారెట్‌తో మన చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సగం ముక్క క్యారెట్ తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్‌లాగా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ అంత తేనె, ఒక టీస్పూన్ పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడంతో చర్మం తేమగా తయారవుతుంది. పగలకుండా కూడా ఉంటుంది. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్నవారు క్యారెట్లు వాడితే చాలా మంచిది. చర్మం నుంచి వచ్చే జిడ్డును ఈ క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ బయటికి పంపిస్తుంది. దాని వల్ల మన చర్మం చాలా మృదువుగా అవుతుంది. ఒక కప్పు క్యారెట్ జ్యూస్‌ని తీసుకోవాలి.. అందులో పెరుగు, శెనగపిండి, నిమ్మకాయ రసం టేబుల్‌ స్పూన్‌ చొప్పున వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని మన ముఖానికి, మెడ భాగంలో ప్యాక్‌లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి కలుగుతుంది. క్యారెట్ జ్యూస్‌లో పెరుగు, కోడిగుడ్డులోని వైట్‌ను సమపాళ్లలో వేసుకుని కలుపుకోవాలి. దాన్ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. చర్మం తాజాగా కూడా అవుతుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. క్యారెట్ జ్యూస్, రోజ్ వాటర్‌ను సమపాళ్లలో కలిపి ఒక స్ప్రే ఉన్న బాటిల్‌లో నింపుకుని సన్ ప్రొటెక్షన్ స్ప్రేగా వినియోగించుకోవచ్చు. ఇలా చేస్తే సూర్యకాంతి, ధూళి నుంచి చర్మానికి ప్రొటెక్షన్‌ ఉంటుంది. క్యారెట్ జ్యూస్, అలోవెరా జ్యూస్‌ని కలిపి దాన్ని రాసుకుంటే చర్మం సౌందర్యవంతంగా మారుతుంది. అంతేకాకుండా యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు అంటున్నారు.


Tags

Related News

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Face Scrub: ఈ ఫేస్ స్క్రబ్స్ వాడితే.. ముఖం మెరిసిపోతుంది తెలుసా ?

Sleep Fast Tips: నిద్ర పట్టడం లేదా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Big Stories

×