E-Paper
Advertisement

రాఖీ రోజు ఏ తప్పులు జరగకుండా ఈ చెక్ లిస్ట్ రెడీ చేయండి..

రాఖీ రోజు ఏ తప్పులు జరగకుండా ఈ చెక్ లిస్ట్ రెడీ చేయండి..
Advertisement

Raksha Bandhan checklist| రక్షాబంధన్.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, ఆప్యాయతను చాటే ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున మహిళలు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. వారి సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తారు. అలాగే పరుషులు తమ సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తూ బహుమతులు ఇస్తారు.

అయితే ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ పండుగ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకుంటే చివరి నిమిషంలో ఎదురయ్యే హడావుడిని తగ్గించుకోవచ్చు. రాఖీ, పూజా సామగ్రి, స్వీట్లు, బహుమతులు, దుస్తులు వంటి వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

ముందుగానే రాఖీలు కొనుగోలు చేయండి

Advertisement

రక్షాబంధన్ వేడుకలో అత్యంత ముఖ్యమైన వస్తువు రాఖీ  మీ సోదరుడి వయస్సు, అభిరుచిని బట్టి రాఖీని ఎంచుకోండి. మార్కెట్లో సంప్రదాయ, డిజైనర్, రుద్రాక్ష, కార్టూన్, లేదా పర్సనలైజ్డ్ రాఖీలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల కోసం స్పెషల్ రాఖీలను కూడా సిద్ధంగా ఉంచండి. రాఖీ పాడైతే ఉపయోగించేందుకు ఒక అదనపు రాఖీని కొనడం మంచిది. కొనుగోలు చేసిన రాఖీలను భద్రంగా ఉంచండి.

పూజా పళ్లెం ముందుగానే రెడీ చేయండి

రాఖీ వేడుకకు ముందే పూజా పళ్లెం సిద్ధం చేసుకోవాలి. ఇందులో కుంకుమ, అక్షతలు, దీపం, నెయ్యి లేదా నూనె, వత్తులు ఉంచాలి. అలాగే స్వీట్లు, పూలు, నీటి కోసం చిన్న పాత్రను సిద్ధంగా ఉంచాలి. పూజా పళ్లెం.. పూలు, లేదా ఇతర డెకరేషన్ వస్తువులతో అందంగా అలంకరించవచ్చు.

మీ బ్రదర్ కోసం మంచి గిఫ్ట్ ఎంచుకోండి

Advertisement

రాఖీతో పాటు సోదరుడికి అతని అభిరుచికి సరిపోయే బహుమతిని ఇవ్వవచ్చు. వాలెట్, వాచ్, పెర్ఫ్యూమ్, షర్ట్, గ్రూమింగ్ ఉత్పత్తులు, పుస్తకాలు, గ్యాడ్జెట్లు మంచి ఎంపికలు. పర్సనలైజ్డ్ గిఫ్ట్‌ను అందించడం ద్వారా మరింత స్పెషల్ ఫీలింగ్ కలిగించవచ్చు. ఆన్‌లైన్‌లో గిఫ్ట్ ఆర్డర్ చేస్తే డెలివరీ తేదీని ముందుగానే చెక్ చేయాలి.

మీ అక్క లేదా చెల్లి కోసం కూడా బహుమతిని సిద్ధం చేయండి

రక్షాబంధన్ సందర్భంగా సోదరులు కూడా తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. వారి అభిరుచికి, మీ బడ్జెట్‌కు అనుగుణంగా మంచి గిఫ్ట్ ఎంచుకోండి. జువెలరీ, హ్యాండ్‌బ్యాగ్, చీర, కుర్తీ, బ్యూటీ ప్రొడక్ట్స్ , పుస్తకాలు, గిఫ్ట్ కార్డులు మంచి ఎంపికలు.

స్వీట్స్, స్నాక్స్ రెడీ చేసుకోండి

రక్షాబంధన్ వేడుకలో స్వీట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఏ స్వీట్లు కొనాలి, ఎంత పరిమాణం అవసరమో ముందే నిర్ణయించాలి. ఇంట్లో తయారు చేయాలా, బయట నుంచి కొనాలా అనేది కూడా ముందుగానే ప్లాన్ చేయాలి. ఇంటికి వచ్చే అతిథుల కోసం స్నాక్స్, టీ, కాఫీ, జ్యూస్ లేదా ఇతర పానీయాలను సిద్ధంగా ఉంచాలి.

పండుగ దుస్తులను ముందుగానే సిద్ధం చేయండి

రక్షాబంధన్ రోజున ధరించే దుస్తులను ముందుగానే ఎంపిక చేసుకోవాలి. సోదరులు, సోదరీమణులు, పిల్లల దుస్తులతో పాటు మ్యాచింగ్ యాక్సెసరీస్, పాదరక్షలను కూడా సిద్ధం చేయాలి. దుస్తులకు ఇస్త్రీ లేదా ఇతర మార్పులు అవసరమైతే ముందుగానే పూర్తి చేయాలి.

ఇంటిని అలంకరించండి

ఇంట్లో రక్షాబంధన్ వేడుక చేయాలనకుంటే ముందుగానే క్లీనింగ్ పనులు పూర్తి చేయాలి. పూజా స్థలం, లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా, గెస్ట్ రూమ్, బాత్‌రూమ్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పూలు, లైట్లు, ఇతర అలంకరణ వస్తువులను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు.

Also Read: రూ.5 కోట్లు, రూ.10 కోట్లు.. హ్యాపీ రిటైర్మెంట్ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి..

కుటుంబంతో కలిసి ఆనందంగా గడపండి

పూజ, ఇతర ఏర్పాట్లను పూర్తి చేసిన తర్వాత రాఖీ వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలి. రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి, బహుమతులు ఇచ్చి, కుటుంబ ఫొటోలు తీసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపాలి. రక్షాబంధన్ బహుమతులకంటే ప్రేమ, అనుబంధం, కుటుంబ ఐక్యతను గుర్తుచేసే పండుగ.

Related News

హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

Big Stories

Advertisement
×