E-Paper
Advertisement

మీ సోదరికి రాఖీ గిఫ్ట్ ఏం ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? రూ.500లోపు బెస్ట్ ఐటెమ్స్ ఇవే

మీ సోదరికి రాఖీ గిఫ్ట్ ఏం ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? రూ.500లోపు బెస్ట్ ఐటెమ్స్ ఇవే
Advertisement

Rakhi gift ideas for sister| రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధాన్ని జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సోదరికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తే ఆమె ఆనందం మరింత పెరుగుతుంది. అయితే గిఫ్ట్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.500 లోపే స్టైలిష్, ఉపయోగకరమైన, ప్రత్యేకమైన బహుమతులు ఎంచుకోవచ్చు. సోదరి అభిరుచి, జీవనశైలి, అవసరాలను దృష్టిలో పెట్టుకుని గిఫ్ట్ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా ఉంటుంది.

1. మంచి జ్యువెలరీ గిఫ్ట్‌

మీ చెల్లి లేదా అక్కకు ఒక ఆభరణం (జ్యువెలరీ) మంచి గిఫ్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఆమెకు నచ్చే డిజైన్‌ను బట్టి ఇయర్‌రింగ్స్, బ్రేస్‌లెట్, పెండెంట్ లేదా రింగ్ ఎంచుకోవచ్చు. ఎక్కువ ధర కారణంగా బంగారం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. రూ.200 నుంచి రూ.500 మధ్యలో అనేక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ డిజైన్లు అందుబాటులో ఉంటాయి. సింపుల్ డిజైన్లు ఇష్టపడితే చిన్న హూప్ ఇయర్‌రింగ్స్ లేదా మినిమల్ పెండెంట్ ఎంచుకోండి.

2. గిఫ్ట్‌గా చిన్న కాస్మెటిక్ కిట్‌

Advertisement

మేకప్‌ ఇష్టపడే మీ సోదరికి చిన్న కాస్మెటిక్ కిట్ మంచి ఆప్షన్. లిప్‌స్టిక్, లిప్ గ్లోస్, కాజల్, నెయిల్ పెయింట్ వంటి వాటిని కలిపి కిట్ తయారు చేయండి. ఆమెకు ఇష్టమైన బ్రాండ్, షేడ్స్‌ను తెలుసుకుని గిఫ్ట్ ఎంచుకోవడం మంచిది.

3. స్కిన్ కేర్ గిఫ్ట్ బాక్స్‌

సెల్ఫ్ కేర్‌ను ఇష్టపడే సోదరికి స్కిన్ కేర్ కిట్ ఉపయోగకరంగా ఉంటుంది. ఫేస్ వాష్, లిప్ బామ్, షీట్ మాస్క్, మాయిశ్చరైజర్ లేదా హ్యాండ్ క్రీమ్ ఇందులో పెట్టవచ్చు. వీటిని అందమైన బాక్స్‌లో ప్యాక్ చేస్తే గిఫ్ట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

4. హ్యాండ్‌బ్యాగ్ లేదా స్లింగ్ బ్యాగ్‌

Advertisement

రోజువారీ ఉపయోగానికి హ్యాండ్‌బ్యాగ్ లేదా స్లింగ్ బ్యాగ్ మంచి గిఫ్ట్ అవుతుంది. కాలేజీ, ఆఫీస్ లేదా బయటకు వెళ్లేటప్పుడు ఆమె దీన్ని ఉపయోగించవచ్చు. బ్లాక్, బ్రౌన్, బేజ్ లేదా పాస్టెల్ రంగులు ఎక్కువ దుస్తులకు సులభంగా సరిపోతాయి.

5. స్పెషల్ ఫోటో ఫ్రేమ్‌

అన్నాచెల్లెళ్లకు సంబంధించిన అందమైన జ్ఞాపకాన్ని ఫోటో ఫ్రేమ్‌లో పెట్టి ఇస్తే బాగుంటుంది. ఫోటోతో పాటు చిన్న ప్రేమపూర్వక మెసేజ్ కూడా రాయండి. తక్కువ ధరలో లభించినా ఈ గిఫ్ట్‌కు ఒక ఎమోషనల్ వ్యాల్యూ ఉంటుంది.

6. పర్సనలైజ్డ్ మగ్‌ గిఫ్ట్

సోదరి పేరు, ఫోటో లేదా ప్రత్యేకమైన సందేశంతో పర్సనలైజ్డ్ మగ్‌ను తయారు చేయించవచ్చు. ఆమె ఆఫీస్ లేదా కాలేజీలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. మగ్‌తో పాటు చాక్లెట్లు లేదా చిన్న నోట్‌ను జోడిస్తే గిఫ్ట్ మరింత అందంగా ఉంటుంది.

7. డైరీ, పెన్ సెట్‌ను ఎంచుకోవచ్చు

రాయడం లేదా ప్లానింగ్ చేయడం ఇష్టపడే సోదరికి డైరీ, పెన్ సెట్ ఉపయోగకరంగా ఉంటుంది. మంచి కవర్ ఉన్న డైరీతో స్టైలిష్ పెన్‌ను కలిపి ఇవ్వండి. మొదటి పేజీలో మీ చే్తో ఒక చిన్న మెసేజ్ రాస్తే అది ప్రత్యేక జ్ఞాపకంగా మిగులుతుంది.

8. చిన్న పెర్ఫ్యూమ్ లేదా బాడీ మిస్ట్‌ను ఇవ్వండి

సువాసనలను ఇష్టపడే సోదరికి చిన్న పెర్ఫ్యూమ్ లేదా బాడీ మిస్ట్ మంచి ఎంపిక. రూ.500 లోపు ట్రావెల్ సైజ్ ఉత్పత్తులను ఎంచుకోండి. ఆమెకు ఇష్టమైన ఫ్లోరల్, ఫ్రూటీ లేదా ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్‌ ఎంచుకోండి.

9. చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్‌ తయారు చేయండి

చాక్లెట్లు అందరికీ సులభంగా నచ్చే గిఫ్ట్ ఆప్షన్. సోదరికి ఇష్టమైన చాక్లెట్లను తీసుకుని చిన్న గిఫ్ట్ ప్యాక్‌గా తయారు చేయండి. దాంతో పాటు చేత్తో రాసిన చిన్న నోట్‌ను జోడిస్తే గిఫ్ట్ మరింత స్పెషల్‌గా ఉంటుంది.

Also Read: ఒకవైపు చంటిపిల్లాడు, మరోవైపు ఆఫీసు బాధ్యత.. మెటర్నిటీ లీవ్ తరువాత పనిచేయడానికి ఆందోళనపడుతన్నారా?

10. చిన్న ఇండోర్ ప్లాంట్‌ గిఫ్ట్

మొక్కలను ఇష్టపడే సోదరికి చిన్న ఇండోర్ ప్లాంట్ మంచి ఆప్షన్. మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి చిన్న మొక్కలను ఎంచుకోవచ్చు.
అందమైన ప్లాంటర్‌తో కలిపి ఇస్తే ఇది ఎక్కువకాలం గుర్తుండే బహుమతిగా మారుతుంది.

గిఫ్ట్ కంటే ప్రేమ ముఖ్యం

రక్షాబంధన్ గిఫ్ట్ ఖరీదైనదిగా ఉండాల్సిన అవసరం లేదు. మీ సోదరి అభిరుచిని గుర్తించి ఇచ్చే చిన్న బహుమతి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గిఫ్ట్‌తో పాటు కలిసి సమయం గడపడం ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

Tags

Related News

తప్పు చేసినా అంగీకరించరు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈగో, మొండితనం ఎక్కువ

రాఖీ రోజు ఏ తప్పులు జరగకుండా ఈ చెక్ లిస్ట్ రెడీ చేయండి..

రాఖీ పండుగకు బాలీవుడ్ టచ్.. అమ్మాయిలకు స్టైలిష్ డ్రెస్‌లు

దగ్గు, జలుబు మందులపై ఆంక్షలు విధించిన కేంద్రం.. పిల్లలకు కఫ్ సిరప్ ఇచ్చే ముందు ఇది తెలుసుకోవాలి

వర్షాకాలంలో నోటి దుర్వాసన, చిగుళ్లలో సమస్యలు తీవ్రం.. ఈ జాగ్రత్తలు పాటించండి

రాఖీ పండుగ రోజు ఇల్లు అందంగా అలంకరించాలా? తక్కువ ఖర్చుతో డెకరేషన్ టిప్స్ మీ కోసం

మలబద్ధకం సమస్యకు అసలు మూలం ఇదే.. ఈ ఫుడ్స్ తింటే సమస్య ఫినిష్

Big Stories

Advertisement
×