E-Paper
Advertisement

విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?

విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?
Advertisement

విజ‌య‌సాయి రెడ్డి దారెటో.. ఎవరు విడిచ‌న బాణ‌మో..? అది ఎవ‌రికి గురి పెట్ట‌బడిందో మెల్ల‌గా అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు. ఏపీ రాజ‌కీయాల్లో ఆట‌లో అర‌టి పండులా విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయ కామెంట్లు, ఆరోప‌ణ‌లు మాత్రం ఏపీ పాలిటిక్స్‌ను హీట్ ను పెంచుతున్నాయి.

ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేసి మ‌త‌ రాజ‌కీయాల‌ను బ‌య‌ట‌కు తోడుతున్న వైనం కూడా అక్క‌డ కూట‌మి స‌ర్కార్‌కు క‌లిసి వ‌స్తోంది. కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్టు.. ఇప్పుడిప్పుడే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు తంటాలు ప‌డుతున్న వైసీపీకి విజ‌య‌సాయిరెడ్డి ఓ మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంలా మాత్రం త‌యార‌య్యాడ‌ని తెలిసిపోయింది.

Advertisement

అన్ని ఏండ్లు అత‌నితో అంట‌కాగిన నేత మాట‌ల‌కు ప్ర‌జ‌ల్లో ఎంత మేర విశ్వ‌సనీయ‌త ఉంటుంద‌నేది ప‌క్క‌న పెడితే.. సూటిగా, ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడుతున్న అత‌ని నైజం మాత్రం కొంచెం లేటైనా అవి ఘాటుగానే వైసీపీని గుచ్చుకునేలా ఉన్నాయి. వాస్త‌వానికి, విజ‌య‌సాయిరెడ్డి బీజేపీలో చేరాలి. కానీ అక్క‌డ రెడ్ సిగ్న‌ల్ రావ‌డంతో కొత్త పార్టీ పెట్టాల్సిన అగ‌త్యం ఏర్ప‌డింది.

ఆ పార్టీ పెట్టినా.. అది బీజేపీకి అనుబంధ సంస్థ‌గానే ఉండ‌నుంద‌నే విష‌యం ఆయ‌నే చెప్ప‌క‌నే చెబ‌తున్నాడు. ఎలాంటి రాజ‌కీయ లౌక్యం లేకుండా, క‌నీసం వ్యూహ‌క‌ర్త‌గా కూడా గుర్తింపు లేని విజ‌య సాయిరెడ్డి పెట్ట‌బోయే పార్టీ ప‌ట్ల ఎక్క‌డా పెద్ద ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. ఆ పార్టీలో చేరిక‌లు కూడా ఎలా ఉండ‌బోతాయే ఇప్పుడే ఓ క్లారిటీ వ‌చ్చేసింది అందరికీ.

Advertisement

అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉండ‌టంతో పాటు ప‌రోక్షంగా కూట‌మి ప్ర‌భుత్వానికి మేలు చేసేదిగా… స‌హయ‌కారిగా ఉండ‌నుంద‌నే విష‌య‌మూ ఆయ‌న మాట‌లే చెప్ప‌క‌నే చెప్పాయి. జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డిల మ‌ధ్య మిత్ర‌బేధం.. కూట‌మి స‌ర్కార్‌కు క‌లిసి వ‌స్తోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య అధికారం కోసం పోరు తారాస్థాయికి చేరుతోంది. ఆధిప‌త్య పోరు కూడా మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. దీనికి తోడు స‌హ‌జంగానే ఉండే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త.. ఇవ‌న్నీ క‌లిసి వైసీపీకి ప్రాణం పోస్తున్నాయి.

ఈ స‌మ‌యంలో స‌రిగ్గా క‌రెక్టు టైమ్‌కు ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్ సాయి రెడ్డి. శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడు అన్న స‌మీక‌ర‌ణను అనుస‌రించి.. ఇది బాబుకు అనుకూలించే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌గా మారింది. ఈ మ‌ధ్య బాబు నోటి వెంట కూడా మ‌త రాజ‌కీయాలు అల‌వోక‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. జ‌గ‌న్‌ను అతని మ‌తానికి ముడిపెట్టి టార్గెట్ చేయ‌డం.. హిందూత్వ భావ‌జాలాన్నిఅందిపుచ్చుకునే ప‌నిలో భాగంగా బీజేపీ స్టాండ్‌ను నేరుగా ప్ర‌జ‌ల్లోకి ఎక్కించే విష‌యంలో బాబు బాగా స‌క్సెస‌వుతున్నాడ‌నే చెప్పాలి.

తిరుమ‌ల ల‌డ్డు క‌ల్తీ వ్య‌వ‌హారాన్ని బాగా ప్రొజెక్టు చేయ‌గ‌లిగారు ఏపీ సీఎం. ఇప్పుడు తాజాగా విజ‌య‌సాయిరెడ్డి.. ల‌వ్ జీహాదీ అంశాన్ని లేవ‌నెత్తి.. జ‌గ‌న్ పార్టీకి దీన్నిరుద్ద‌డం కూడా కూట‌మి స‌ర్కార్‌కు బాగా క‌లిసి వ‌స్తోంది. మొత్తానికి అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు ఏపీలోని కూట‌మి స‌ర్కార్ రాజ‌కీయ గొడుకు కింద సేద‌తీరే ఓ పార్టీగా విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీ అవ‌తార‌మెత్త‌నుంద‌నే విష‌యం క్లారిటీకి వ‌స్తోంది ఏపీ ప్ర‌జ‌ల‌కు.

Tags

Related News

ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు! సెల్ఫ్‌ డిస్మిస్‌ అస్త్రంతో లొంగదీసుకునే ప్రయోగం! 52 రోజుల సమ్మె.. మరణించిన కార్మికులు..!

ఆర్టీసీ ఎన్నికల ఫలితాలపై బీఆరెస్‌ సైలెంట్‌.. ! కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలొచ్చినా.. ఓన్‌ చేసుకోలేని దీన స్థితి..! యూనియన్లనే రద్దు చేసిన ఘతన ఆ పార్టీది!

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! పరస్పర ఆరోపణలతో గోక్కోవడంతోనే సరి! డైవర్షన్ పాలిటిక్స్ లో పోటాపోటీ!

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

Big Stories

Advertisement
×