E-Paper
Advertisement

కారు కొనడం నుంచి ఎక్స్చేంజ్ వరకు.. స్పిన్నీ ప్లాన్ అదిరింది గురూ!

కారు కొనడం నుంచి ఎక్స్చేంజ్ వరకు.. స్పిన్నీ ప్లాన్ అదిరింది గురూ!
Advertisement

Spinny Partners With Nissan, MG and Tesla: భారత కార్ల మార్కెట్‌ లో యూజ్డ్ కార్ల కొనుగోలు, అమ్మకాలు, ఎక్స్చేంజ్ సేవలకు పేరున్న స్పిన్నీ ఇప్పుడు తన బిజినెస్ ను మరింత విస్తరిస్తోంది. కొత్త కార్ల కొనుగోలు నుంచి వాడిన కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, కార్ల ఎక్చేంజ్ వరకు అన్ని సర్వీసులను ఒకే ప్లాట్‌ ఫామ్‌ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నిస్సాన్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, టెస్లాతో డీల్ చేసుకుంది. ఇంతకీ ఈ భాగస్వామ్యం వల్ల కస్టమర్లకు కలిగే లాభం ఎంత? స్పిన్నీ ప్లాన్ ఏంటి?  అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిస్సాన్ కస్టమర్లకు రూ.75 వేల వరకు బెనిఫిట్స్

నిస్సాన్ ఇండియాతో స్పిన్నీ వెహికల్ ఎక్చేంజ్ భాగస్వామిగా చేరింది. కొత్త నిస్సాన్ కారును కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు తమ పాత కారును స్పిన్నీ ద్వారా అమ్ముకోవచ్చు. లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను రూ.75,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అంతేకాదు, వెహికల్ పరిశీలన నుంచి ఎక్స్చేంజ్ ప్రక్రియను సుమారు 55 నిమిషాల్లో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

టెస్లా కొనేవారికి కూడా ఎక్స్చేంజ్ సౌకర్యం

Advertisement

టెస్లా స్విచ్ అండ్ సేవ్ కార్యక్రమంలో కూడా స్పిన్నీ భాగస్వామిగా ఉంది. కొత్త టెస్లా కొనాలనుకునే కస్టమర్లు తమ పాత పెట్రోల్, డీజిల్ కారును స్పిన్నీ ద్వారా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టెస్లా మోడల్ Y రియర్ వీల్ డ్రైవ్‌కు మారే కస్టమర్లకు అనుకూలంగా ఉంటుంది. అంటే, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కారును అమ్మితే, దాని విలువను కొత్త ఎలక్ట్రిక్ కారుకు మారే సమయంలో ఉపయోగించుకోవచ్చు.

వాడిన MG EVలకు బ్యాటరీ చెక్

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాతో స్పిన్నీ భాగస్వామ్యం ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లపై ఫోకస్ పెడుతోంది. MG కామెట్ EV, MG విండ్సర్ EV, MG ZS EV లాంటి వాడిన ఎలక్ట్రిక్ కార్లను సర్టిఫైడ్ వాహనాలుగా అమ్మేందుకు ఈ డీలింగ్ ఉపయోగపడనుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఆకర్షణ బ్యాటరీ హెల్త్ చెక్. వాడిన EV కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ పరిస్థితి ఎలా ఉందనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు బ్యాటరీ హెల్త్ అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ చేయనుంది.

EVల కోసం ప్రత్యేక తనిఖీలు

Advertisement

వాడిన ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, బ్యాటరీ హెల్త్, వెహికల్ రీసేల్ విలువ వంటి అంశాలు కొనుగోలుదారులను ఆలోచింపజేస్తున్నాయి. అందుకే స్పిన్నీ తన EV చెకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. EV డయాగ్నోస్టిక్స్, బ్యాటరీ హెల్త్ చెక్, రీస్టోరేషన్ లాంటి సేవలను ఇంటిగ్రేటెడ్ రిస్టోరేషన్ సెంటర్లలో అందిస్తోంది. ప్రస్తుతం స్పిన్నీ 80కి పైగా నగరాల్లో, 57కి పైగా కార్ హబ్‌లు, 17 స్పిన్నీ పార్కులు, 15కి పైగా ఇంటిగ్రేటెడ్ రిస్టోరేషన్ సెంటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Read Also: డిజైర్ To పంచ్.. రూ. 10 లక్షల్లోపు బెస్ట్ CNG కార్లు ఇవే!

Tags

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×