Good Health Habits: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం అనేది పెద్ద సవాల్‌గా మారింది. అనేక అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండటం చాలా కష్టతరంగా మారింది. అయితే ఇప్పుడు మనం తినే కలుషిత ఆహారం, స్వచ్ఛత లేని నీరు, కలుషిత గాలి.. దీంతో అనేక ఆనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందాం.
1. ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా లేచి బయట నడిచి రావడం ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. దీని వల్ల మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా పని చేస్తారు.
2. అలాగే రాత్రి భోజనం అయిన తర్వాత కూడా ఒక కిలో మీటర్ నడవటం మంచిది. దీని వల్ల తిన్న ఆహారం పరిపూర్ణంగా జీర్ణమవుతుంది, నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది.
3. రాత్రి సమయంలో 10 గంటలకు ముందే నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు, అనేక ఆనారోగ్య సమస్యలను నివారిస్తుంది. రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది కాదని పలు వైద్య నిపుణులు చెబుతున్నారు.
4. నిల్వ ఉన్న వంటకాలు తినకూడదు. అలా తినడం వల్ల కళ్లు బరువుగా మొద్దుబారినట్లు ఉంటుంది. అలాగే చురుకుగా ఉండలేము అని తెలిపారు.
5. దంతాలు శుభ్ర పరుచుకున్న తర్వాత ఇతర ఆహారం తీసుకునే ముందు 5 నుంచి 6 తులసీ ఆకులు నమలడం ద్వారా జ్వరం వంటివి రాకపోవడమే కాకుండా జీర్ణ శక్తిని కూడా పెంపొందుతుంది.
6. అతి వేడిగా ఉన్న వస్తువులు, మసాలాలు, అతి కారం తినకూడదు. ఇలా తినడం వల్ల కడుపు, ప్రేగులు బలహీనపడతాయి.
7. స్నానం చేసిన వేంటనే భోజనం చేయకూడదు. ఎందుకంటే జీర్ణ శక్తి చెడి పోతుంది. అలాగే తిన్న వెంటనే కూడా స్నానం చేయకూడదు. తినడానికి స్నానానికి మధ్య గంట సమయం గ్యాప్ ఇవ్వాలి.
Also Read: మీ జుట్టు ఫాస్ట్‌గా పెరగాలా..! అయితే వెంటనే వీటిని తినండి..
8. అలాగే ఆహారం బాగా నమిలి తినాలి. ఇలా తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. బాగా నమలకుండా అలాగే తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
9. అన్నం తినే ముందుగాని, తిన్న తర్వాత గాని అల్లం ఉప్పు కలిపి తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.
10. వేడి అన్నం గాని, వేడి టీ గాని, వేడి పాలు తాగిన వెంటనే చల్లని మంచి నీరు తాగకూడదంటున్నారు నిపుణులు.
11. అంతేకాకుండా రాత్రి సమయంలో భోజనం నిద్రపోయే మూడు గంటల ముందు చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు పడుకునే సమయంకు మీరు తిన్న ఆహారం బాగా జీర్ణమయి నిద్ర చక్కగా పడుతుంది.
12. తల చల్లగా, పాదాలు వెచ్చగా ఉండటం ఆరోగ్య వంతుల లక్షణం.