Trains Homes:సాధారణంగా రైల్వే బోగీలు ప్రతి ఏటా కొత్తవి వచ్చి చేరుతాయి. పాతవి షెడ్యుకు తరలిస్తారు. వాటిని మళ్లీ కొత్త బోగీలుగా తయారు చేస్తారు. ఇదో నిరంతర ప్రక్రియ. అయితే, కొన్ని దేశాల్లో పాత రైల్వే బోగీలను పాత ఇనుప సామానుకు అమ్మేయకుండా చక్కటి ఇండ్లుగా మార్చారు. వాటిని టూరిస్టులు బస చేసేందుకు అద్దెకు ఇస్తున్నారు. చూడ్డానికి చిన్నగా ఉన్నా, సకల సౌకర్యాలతో వావ్ అనిపిస్తున్నాయి. రైల్వే బోగీలతో తయారైన ఇండ్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అందమైన టాప్ రైల్వే ఇళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ జేమ్స్ స్టేషన్, వర్జీనియా- అమెరికా: ఈ రైల్వే బోగీ ఇళ్లు ఎంతో అందంగా ఉంటుంది. వర్జీనియాలోని లించ్ బర్గ్ లోని ఒక కొండపై కూర్చుని, చుట్టూ ఉన్న సముద్ర జలాలతో పాటు ప్రకృతి అందాలను 360 డిగ్రీ యాంగిల్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. పాత రైలు పట్టాలపై ఏర్పాటు చేయబడిన ఎరుపు బోగీ ఒకప్పుడు సదరన్ రైల్వేకి చెందినది. ఈ బోగీ లోపల, నిర్మించిన చిన్న ఎంతో ఆకట్టుకుంటుంది. కావాల్సిన అన్ని వసతులను అందిస్తుంది. మోడ్రన్ కిచన్, బాత్రూమ్, బెడ్ రూమ్ మధ్యలో లివింగ్, డైనింగ్ ఏరియా ఉంటాయి. ఇక్కడ బస చేయాలనుకుంటే Airbnb ద్వారా అద్దెకు అందుబాటులో ఉంది.
⦿ M2 రైల్వే క్యారేజ్, ఫ్లెమిష్ బ్రబంట్- బెల్జియం: బెల్జియం లాండెన్ లోని పాత రాకోర్ రైలు స్టేషన్ రైల్ రోడ్ లో ఈ క్యారేజ్ ఉంటుంది. 1990 వరకు బెల్జియన్ రైల్వే నెట్ వర్క్ లో సేవలు అందించింది. ఇప్పుడు ఆ క్యారేజ్ లు సౌకర్యవంతమైన హాలిడే హోమ్ లుగా మారాయి. ఇక్కడ టూరిస్టులు ప్రత్యేకమైన విహారయాత్రను ఆస్వాదిస్తారు. ఓపెన్ ప్లాన్ లో సిట్టింగ్ ఏరియా, వంటగది, డైనింగ్ స్పేస్, బెంచ్ సీట్లు, లగేజ్ రాక్‌లు సహా విచిత్రమైన రైలు ఫిక్చర్ లు బోలెడు ఉన్నాయి. అందులో రెండు సింగిల్ బెడ్లు, నలుగురు పడుకునే ఒక బంక్ రూమ్ తో కూడిన పెద్ద బెడ్ రూమ్ ఉంటుంది. వాక్ ఇన్ షవర్ తో కూడిన చిన్న బాత్రూమ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరూ అక్కడ గడపాలనుకుంటే, Airbnb ద్వారా అద్దెకు తీసుకోవచ్చు.
⦿ ఫియోర్డ్ ల్యాండ్ క్యారేజ్, సౌత్ ఐలాండ్- న్యూజిలాండ్: ఫియోర్డ్ ల్యాండ్ క్యారేజ్ 1912 టైరీ జార్జ్ రైల్వే కార్. న్యూజిలాండ్ సౌత్ ఐలాండ్ లోని టె అనౌలో, ఫియోర్డ్ ల్యాండ్ నేషనల్ పార్క్, మిల్ ఫోర్డ్ సౌండ్‌కు దగ్గరగా ఉంటుంది. క్యారేజ్ లోపలి భాగం ఒక పొడవైన గదిగా ఏర్పాటు చేయబడింది. మధ్యలో ఉన్న బాత్ టబ్ స్థలంలో ప్రైవసీ కోసం డివైడర్ కర్టెన్లు ఉన్నాయి. ఇందులో బెడ్ రూమ్, మరొక చివర వంటగది, డైనింగ్ హాల్ ఉంటుంది. వింటేజ్ అద్దాలు, ఫర్నిషింగ్, పాత సూట్ కేసులు, గడియారాలు, లైట్ ఫిట్టింగ్ల వరకు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో ఇద్దరు అతిథులు హ్యాపీగా బస చేయవచ్చు.విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఉంటుంది. అందులో నుంచి అందమైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది.
⦿ విలేజ్ రైల్వే వ్యాగన్, నార్త్ రైన్-వెస్ట్ ఫాలియా- జర్మనీ: ఈ విలేజ్ రైల్వే వ్యాగన్ జర్మనీలోని నార్త్ రైన్ వెస్ట్ ఫాలియాలోని డహ్లెమ్‌లో ఉంది. ఈ చిన్న ఇల్లు ష్మిత్ థైమ్ లోని పాత రైల్వే స్టేషన్ మైదానంలో ఉంది. ఓపెన్ కాన్సెప్ట్ ఇంటీరియర్ లాంజ్, వంటగది, డైనింగ్ స్పేస్ ను కలిగి ఉంటుంది. చక్కటి బాత్రూమ్, బెడ్ రూమ్ ఉన్నాయి. నిగనిగలాడే చెక్క అంతస్తుల నుంచి వింటేజ్ లైట్ ఫిక్చర్లు ఆకట్టుకుంటాయి. కేవలం 377 చదరపు అడుగుల్లో ఉండే ఈ వ్యాగన్ ఇద్దరు బస చేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.
⦿ పుల్మాన్ రైల్వే క్యారేజ్, కుంబ్రియా- UK: ఈ వింటేజ్ రైల్వే నివాసం ఎంతో ఆకట్టుకుంటుంది. పుల్మాన్ రైల్వే క్యారేజ్ లోకి అడుగు పెట్టడం ద్వారా, గత రైల్వే ప్రయాణాల గ్లామర్ ను అనుభవించవచ్చు. 1950ల నాటి పాత బండిని లేక్ డిస్ట్రిక్ట్ నేషనల్ పార్క్ శివార్లలోని పట్టాలపై చూడవచ్చు. ఇందులోకి అడుగు పెడితే పాత కాలంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. 21వ శతాబ్దపు జీవన విలాసాలతో అలంకరించబడి ఉంటుంది. వింటేజ్ రాయల్ డౌల్టన్ క్రోకరీతో కూడిన వంటగది, డైనింగ్ క్యారేజ్, ప్రైవేట్ ట్రావెల్ కంపార్ట్ మెంట్ ఉన్నాయి. పురాతన బెడ్, డ్రెస్సింగ్ రూమ్, ఎన్సూట్ బాత్రూమ్‌తో కూడిన కింగ్-సైజ్ మాస్టర్ సూట్ తో ఆకట్టుకుంటుంది. ఉదయం కాఫీ తాగడానికి, డిటెక్టివ్ ఫిక్షన్ స్పాట్‌కు ఇది బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు.
Read Also: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!