ప్రతి ఏడాది చెడు కొలెస్ట్రాల్ కారణంగా 26 లక్షల మంది మరణిస్తున్నట్టు అంచనా. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ వ్యాయామం చేస్తూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఫైబర్ అధికంగా చేరడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే ఉదయం పూట టీ, కాఫీలను పూర్తిగా మానేస్తేనే మంచిది.
ఆహారాన్ని గుటుక్కున మింగేయకుండా బాగా నమిలి మింగేందుకు ప్రయత్నించండి. ఎంతగా ఆహారాన్ని నమిలితే ఆరోగ్యానికి అంత మంచిది. నెమ్మదిగా తినడం వల్ల కొలెస్ట్రాల్ త్వరగా పేరుకుపోకుండా ఉంటుంది. మీరు ఆహారం పూర్తిగా నమిలినప్పుడు శరీరం మరింత జీర్ణక్రియ ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వులను సమర్ధవంతంగా విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణక్రియ సవ్యంగా జరిగినప్పుడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది.
ఇంట్లో తయారుచేసిన పెరుగు, ఊరగాయ, మజ్జిగ వంటి పులియపెట్టిన ఆహారాలను తరచూ తినడం అవసరం. ఇలా తినడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యంగా ఉంటుంది. ఇవి ప్రోబయోటిక్స్‌ను కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన పొట్ట మీ శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్ ను బయటికి పంపించేస్తుంది.
ప్రతిరోజూ ఉదయం ఐదు నిమిషాల పాటు గాఢంగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోండి. అది కొలెస్ట్రాల్‌కు అతిపెద్ద కారకాల్లో ఒత్తిడి కూడా ఒకటి. ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇది ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. లోతైన స్వాగతం తీసుకోవడం వల్ల లేదా ఐదు నిమిషాల పాటు మైండ్ ఫుల్ సాధన చేయడం వల్ల మీ ఒత్తిడి సాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.