E-Paper
Advertisement

Toilet Stains Trick: టాయిలెట్‌లో మొండి మరకలతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సింపుల్ ట్రిక్‌తో క్లీన్ చేస్తే మెరిసిపోతుంది

Toilet Stains Trick: టాయిలెట్‌లో మొండి మరకలతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సింపుల్ ట్రిక్‌తో క్లీన్ చేస్తే మెరిసిపోతుంది
Advertisement

Toilet Stains Removal Trick| ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేయడం ఇంటి పనుల్లో అత్యంత బోరింగ్ పని. టాయిలెట్ మురికిగా, దుర్వాసనగా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి చాలా మంది అసహ్యించుకుంటారు. ఎందుకంటే ఆ మొండి మరకలు తొలగించడానికి గంటల తరబడి రుద్దాల్సి వస్తుంది. పైగా క్లీన్ చేయడానికి ఉపయోగించే కెమికల్ క్లీనర్ల వాసనలు అసౌకర్యం కలిగిస్తాయి. కష్టపడి రుద్దినా పూర్తిగా మరకలు తొలగిపోవు. అందుకే ఈ సమస్యకు ఈజీ పరిష్కారం ఉంది. ఇంట్లోనే ఉన్న సామగ్రితో సులభంగా టాయిలెట్ శుభ్రం చేయవచ్చు.

టాయ్‌లెట్ క్లీన్ చేయడానికి ఈజీ ట్రిక్

ఈ ట్రిక్‌లో ఖరీదైన క్లీనర్లు అవసరం లేదు. కేవలం ఇంట్లో సులభంగా లభించే బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ ఉపయోగించాలి. ఈ రెండు పదార్థాలు కలిపి ఉపయోగిస్తే మొండి మరకలను సులభంగా తొలగిపోతాయి. ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా టాయిలెట్ శుభ్రం అవుతుంది. పైగా టాయిలెట్ తళతళా మెరిసిపోతుంది. ఈ ట్రిక్ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అవుతోంది.

బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ రెండూ ఏ విధంగా పనిచేస్తాయి?

Advertisement

బేకింగ్ సోడా దుర్వాసనలను గ్రహించి, మరకలను లూజ్ చేస్తుంది. టూత్‌పేస్ట్‌లో ఉండే క్లీనింగ్ ఏజెంట్లు మరకలను మెత్తగా విచ్ఛిన్నం చేస్తాయి. రెండూ కలిపితే ఒక బలమైన క్లీనింగ్ ఏజెంట్ మిక్స్ శక్తిగా మారుతుంది. టాయిలెట్ మొండి మరకలు సులభంగా తొలగిపోతాయి.

ఎలా క్లీన్ చేయాలి?

ముందుగా టాయిలెట్ సీటు మీద బేకింగ్ సోడా చల్లండి. మరకలు ఉన్న అన్ని ప్రాంతాలను కవర్ చేయండి. కొంత నీరు స్ప్రే చేస్తే సోడా కాస్త అదే ప్రాంతంలో పట్టుకుంటుంది.
తర్వాత మొండి మరకలపై టూత్‌పేస్ట్ అప్లై చేయండి. సాదా వైట్ టూత్‌పేస్ట్ ఉపయోగించాలి.
30 నుంచి 60 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తడి గుడ్డతో తుడిచేయండి. మరకలు సులభంగా తొలగిపోతాయి. చివరగా ఒకసారి ఫ్లష్ చేయండి.

బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ క్లీనింగ్ ప్రయోజనాలు

Advertisement

ఈ ట్రిక్ ఉపయోగించేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇప్పటికే ఉన్న వస్తువులతోనే సులభంగా క్లీనింగ్ అయిపోతుంది. పైగా ఘాటు కెమికల్ వాసనలు రావు. బాత్‌రూమ్ ఫ్రెష్‌గా ఉంటుంది. టూత్‌పేస్ట్ మైల్డ్ మింట్ వాసన ఇస్తుంది. టాయిలెట్ ఉపరితలానికి హాని చేయదు. క్రమం తప్పకుండా చేస్తే టాయిలెట్ ఎప్పుడూ శుభ్రంగా, మెరిసేగా ఉంటుంది.

Also Read:  ఇంట్లో కాక్రోచ్‌ల బెడదతో విసిగిపోయారా? ఇలా చేస్తే ఇల్లంతా క్లీన్

మంచి ఫలితాల కోసం చిట్కాలు

టాయిలెట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. మరకలు పేరుకుపోకుండా చూసుకోండి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ట్రిక్ ఉపయోగించండి. శుభ్రం చేసిన తర్వాత బాగా రిన్స్ చేయండి. బాత్‌రూమ్‌లో ఎప్పుడూ బాగా వెంటిలేషన్ (గాలి వీచే విధంగా) ఉండేలా చూసుకోండి. అంటే కిటకీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే బెటర్.

టాయిలెట్ శుభ్రం చేయడం ఇక ఏ మాత్రం కష్టమైన పని కాదు. ఇంట్లో ఉన్న సామగ్రితో సులభంగా చేయొచ్చు. బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఈ ట్రిక్ సమయం, డబ్బు, శ్రమ అన్నీ ఆదా అవుతాయి. మీ బాత్‌రూమ్ ఎప్పుడూ ఫ్రెష్‌గా, శుభ్రంగా ఉంటుంది. ఈ సులభమైన ట్రిక్ ప్రయత్నించి మెరుగైన ఫలితాలు పొందండి.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×