White Clothes: తెల్లటి బట్టలపై మరకు తొలగించడం చాలా కష్టమైన పని. తెల్లటి బట్టలపై తేలికపాటి మరకలు కూడా చూడటానికి ఇబ్బంది కరంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో.. తెల్లటి బట్టలను సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇంట్లో లభించే సాధారణ పదార్థాలు వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ , ఉప్పు వంటివి ఈ మరకలను ఈజీగా తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి మీ బట్టలు కొత్తవిలా మెరుసేలా చేస్తాయి. రసాయన క్లీనర్ల అవసరాన్ని కూడా తగ్గిస్తాయి.
కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల తెల్ల బట్టలపై ఉండే మొండి మరకలు తొలగిపోతాయి. చెమట, టీ, కర్రీస్, వైన్, జిడ్డుగల మరకలు లేదా తుప్పు మరకలు ఏదైనా, వాటిని సరైన సమయంలో, సరైన మార్గంలో తొలగించడం వల్ల తెల్లటి బట్టలు ఎక్కువ కాలం కొత్తవిలా కనిపిస్తాయి. ఈ హోం రెమెడీస్ తక్కువ సమయంలోనే మీ పనిని సులభం చేస్తాయి.
బట్టల నుండి మరకలను తొలగించడానికి 5 మార్గాలు
తెల్లటి వెనిగర్: చెమట, మొండి మరకల కోసం
వైట్ వెనిగర్ సహజ బ్లీచ్ లా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక కప్పు వెనిగర్ కలిపి మరకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి.. 20–30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత ఎప్పటిలాగే వాష్ చేయండి. ఈ పద్ధతి చెమట, ధూళి, తేలికైన మరకలకు చాలా ప్రభా వవంతంగా ఉంటుంది. దీనిని వాడటం వల్ల తెల్లటి బట్టలపై మరకలు తొందరగా తొలగిపోతాయి. ఫాబ్రిక్ కూడా మృదువుగా మారుతుంది.
నిమ్మరసం: సహజ బ్లీచ్
నిమ్మరసం కూడా తేలికపాటి ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మరసాన్ని మరకలపై అప్లై చేయాలి. తర్వా త30 నిమిషాలు ఎండలో ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేయండి. ఈ పద్ధతి తుప్పు, చెమట, మరకలను ఈజీగా తొలగిస్తుంది.
బేకింగ్ సోడా పేస్ట్:
బేకింగ్ సోడాను రెండు లేదా మూడు సార్లు నీటితో కలిపి మందపాటి పేస్ట్ లా చేయండి. తర్వాత దీనిని మరకపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి.. మెల్లగా బ్రష్ చేసి, తర్వాత కడిగేయండి. ఈ పద్ధతి ముఖ్యంగా జిడ్డుగల మరకలు, టీ లేదా ఇతర మరకలను తొలగిస్తుంది. బేకింగ్ సోడా యొక్క ఆల్కలీన్ స్వభావం మరకలను తొలగించి ఫాబ్రిక్‌ను రిఫ్రెష్ చేస్తుంది.
Also Read: ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే.. బోలెడు లాభాలు
హైడ్రోజన్ పెరాక్సైడ్:
3% హైడ్రోజన్ పెరాక్సైడ్ సహజ ఆక్సిజన్ బ్లీచ్‌గా పనిచేస్తుంది. మరకపై నేరుగా దీనిని అప్లై చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై సాధారణ సబ్బుతో వాష్ చేయండి. చెమట, రక్తం, వైన్ లేదా మేకప్ వంటి మొండి మరకలపై ఇది ప్రభా వవంతంగా పనిచేస్తుంది.
ఉప్పు, నీరు:
తాజా వైన్,రక్తం లేదా గ్రీజు మరకలపై ఉప్పునీరు చల్లుకోండి. ఉప్పు ద్రవాన్ని పీల్చుకునేలా 5–10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీరు, సబ్బుతో శుభ్రం చేసి, ఎప్పటిలాగే ఉతకండి. ఉప్పు తేమను త్వరగా గ్రహిస్తుంది. అంతే కాకుండా మరక వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.