Herbal Hair Colour: తెల్ల జుట్టు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొన్ని రకాల హెయిర్ కలర్స్‌తో పాటు షాంపూలను కూడా వాడుతున్నారు. రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.అంతే కాకుండా డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు అవుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హెర్బల్ హెయిర్ కలర్స్ వాడటం మంచిది. వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా సహజంగానే జుట్టు నల్లగా మారుతుంది. మరి ఇంట్లోనే హెర్బల్ హెయిర్ కలర్ ఎలా తయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెర్బల్ హెయిర్ కలర్ తయారీ:
కావాల్సినవి:
బీట్ రూట్ పేస్ట్- 1 చిన్న కప్పు
కాటేచు పొడి- 1 టేబుల్ స్పూన్
నిగెల్లా పొడి- 1 టేబుల్ స్పూన్
మెంతి పౌడర్- 1 టేబుల్ స్పూన్
కాఫీ పౌడర్- 1 టేబుల్ స్పూన్
తయారు చేసుకునే విధానం:
హెర్బల్ హెయిర్ కలర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు నీరు వేసి వేడి చేయండి. ఆ తర్వాత అందులోనే బీట్ రూట్ పేస్ట్ వేయండి. తర్వాత కాటేచు పౌడర్, నిగెల్లా పొడి, టీ స్పూన్ మెంతి పొడి, కాఫీ పౌడర్ వేసి ఉడికించండి. ఇది 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత మీ జుట్టుకు ఈ కలర్ అప్లై చేయండి.
Also Read: బట్టతల రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఒక వేళ మీరు చుండ్రు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనక ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఇది చుండ్రును తగ్గిస్తుంది. అంతే కాకుండా స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వేప ఆకుల పొడిని ఈ హెర్బల్ హెయిర్ కలర్ లో వాడటం వల్ల కూడా చుండ్రు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు.
2. ఉసిరి, శీకాకాయ పౌడర్‌లతో హెయిర్ కలర్:
కావాల్సినవి:
ఉసిరి కాయ పౌడర్- 3 టేబుల్ స్పూన్లు
శీకాకాయ పౌడర్- 3 టేబుల్ స్పూన్లు
మెంతి పౌడర్- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: ఈ హెయిర్ కలర్ తయారు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పై మందపాటి బౌల్ పెట్టి కాస్త నీరు వేసి మరిగించండి. తర్వాత అందులోనే శీకాకయ్ పౌడర్‌తో పాటు, ఉసిరి పొడిని వేసుకుని మిక్స్ చేయండి. ఈ మిశ్రమం చిక్కగా మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. తర్వాత దీనినిమీ జుట్టు కుదుళ్ల నుంచి మొత్తం అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు నల్లబడుతుంది. అంతే కాకుండా తెల్లజుట్టు రాకుండా ఉంటుంది.
ఉసిరి జుట్టులోని మెలనిన్ మొత్తాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఇందులోని విటమిన్ సి, ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉసిరిలో ఉంటాయి. ఇవి దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా జుట్టుకు పోషణను అందించి జుట్టును సహజంగానే నల్గా మారుస్తాయి.
శీకాకాయ్ జుట్టుకు సహజరంగును అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును నల్లగా మారుస్తుంది. దీనిని తరుచుగా అప్లై చేయడం వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.