BigTV English
Advertisement

Salt Hacks: కూరల్లో సాల్ట్ ఎక్కువైందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Salt Hacks: కూరల్లో సాల్ట్ ఎక్కువైందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Salt Hacks: ఏ కూరలు వండినా ఉప్పు కారం, మసాలాలతో పాటు ఇతర పదార్థాలు తగిన మోతాదులో వేస్తేనే రుచి బాగుంటుంది. కానీ కొన్ని సార్లు వంట చేసేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వంటకాల రుచి పూర్తిగా మారిపోతుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న కూరలు తినడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు.


మరి కర్రీల్లో ఉప్పు ఎక్కువైతే బయట పడేసేవారు కూడా లేకపోలేదు.  కానీ ఇలా చేయకుండా కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పద్ధతులు కూరల్లో ఎక్కువగా ఉన్న ఉప్పును సమతుల్యం చేయడమే కాకుండా.. కూరగాయల రుచి చెడిపోకుండా కూడా చేస్తాయి.  మరి ఆ టిప్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరల్లో ఉప్పు తగ్గించడానికి చిట్కాలు:


ఉడికించిన బంగాళదుంపలు:
బంగాళదుంప తొక్క తీసి.. శుభ్రంగా కడిగి ఒకటి లేదా రెండు చిన్న ముక్కలుగా కోయండి. వాటిని కొద్ది నీటిలో ఉప్పు వేయకుండా వేసి ఉడికించండి. ఇలా ఉడికించిన బంగాళదుంపలను మెదిపి ఉప్పు ఎక్కువగా ఉన్న మీ కూరల్లో వేయండి. కర్రీలో వేసిన బంగాళదుంప  అదనపు ఉప్పును పీల్చుకుని మీ కర్రీ రుచిని పెంచుతాయి.

తాజా క్రీమ్ లేదా పెరుగు:
ఉప్పు ఎక్కువగా ఉన్న కర్రీలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల తాజా క్రీమ్ లేదా పెరుగు వేసి బాగా కలపండి. క్రీమ్ లేదా పెరుగు ఉప్పదనాన్ని తగ్గించడానికి , కూర కొద్దిగా క్రీమీగా మారడానికి సహాయపడతాయి. ఇలా చేయడం వల్ల కర్రీ యొక్క రుచి కూడా మెరుగుపడుతుంది.  1 టేబుల్ స్పూన్ పాల మీగడ కర్రీలో వేసినా కూడా ఇది ఎక్కువగా ఉప్పును పీల్చుకుంటుంది. అంతే కాకుండా గ్రేవీలో కలిసి మంచి టేస్ట్ ను కూరలకు అందిస్తుంది.

టమాటో:
కూరగాయలలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఇందుకోసం టమాటో చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. కర్రీలో చిన్న చిన్న టమాటో ముక్కలను కోసి యాడ్ చేయండి. లేదా ఒక టీస్పూన్ టమాటో ప్యూరీ యాడ్ చేసి గ్యాస్ పై 5 నిమిషాల పాటు ఉడికించండి. టమాటోల సహజ ఆమ్లత్వం ఉప్పు రుచిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఉప్పుదనాన్ని తొలగించి కర్రీ రుచిని మెరుగుపరుస్తుంది.

చక్కెర:
ఉప్పు ఎక్కువగా ఉన్న కర్రీలో చిటికెడు చక్కెర కలపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉప్పదనాన్ని తగ్గించడానికి కొద్దిగా చక్కెర వేసినా  కర్రీ తినడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కొంచెం తీపిగా ఉండే గ్రేవీ తినడానికి ఇష్టపడే వారికి ఈ పద్ధతి మంచిది. బెల్లం కూడా కూరల్లో ఎక్కువగా ఉప్పును తొలగించడానికి ఉపయోగపడుతుంది. చిన్న బెల్లం ముక్కను ఉప్పగా ఉన్న కూరల్లో వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: గ్లిజరిన్‌లో ఈ 2 కలిపి వాడితే.. రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది

నీరు:
ఫ్రై కర్రీలో ఉప్పు ఎక్కువైతే మాత్రం కొంచెం నీరు వేసి బాగా కలపండి. తర్వాత 2 నిమిషాలు గ్యాస్ పై వేడి చేయండి. ఇలా చేయడం వల్ల కర్రీ రుచి మెరుగుపడుతుంది.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×