Civil Aviation: విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇకపై కిటికీల షేడ్‌లను కిందకు దించాల్సిన అవసరం లేదని ప్రకటించింది పౌర విమానయాన శాఖ. అయితే ఫోటోలు, వీడియోల నిషేధం కొనసాగుందని వెల్లడించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA ప్రకటన చేసింది.
మే నెలలో పాకిస్తాన్‌తో భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఓ నిర్ణయం తీసుకుంది పౌర విమానయాన శాఖ. భారత వైమానిక దళం ఉపయోగించే ఎయిర్‌పోర్టుల్లో అన్ని వాణిజ్య విమానయాన సంస్థలు విమానాల టేకాఫ్- ల్యాండింగ్ సమయంలో విమాన కిటికీల షేడ్స్‌ను మూసి వేయాలని DGCA ఆదేశాలు జారీ చేసింది.
విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తుకు చేరుకునే వరకు, ల్యాండింగ్‌కు ముందు ఈ నిబంధన వర్తించింది. సైనిక స్థావరాల వద్ద ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం విధించింది. ఈ విషయంలో ప్రయాణికులను అప్రమత్తం చేయాలని విమానయాన సంస్థలను DGCA కోరింది.
అయితే ఐఏఎఫ్ సవరించిన ఆదేశాల తర్వాత విండో షేడ్స్‌ను దించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎయిర్‌పోర్టులలో గాలిలో, నేలపై ఫోటోగ్రఫీపై నిషేధం కొనసాగుతుంది. ఈ లెక్కన ప్రయాణికులు విమానం లోపల-బయట ఫోటోలు లేదా వీడియోలు తీయరాదు.
ALSO READ: డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ నెల ప్రారంభంలో దేశంలో పైలట్ శిక్షణ ప్రమాణాలను పెంచడానికి DGCA ఓ అడుగు ముందుకేసింది. జులై 9న ఏవియేషన్ రెగ్యులేటర్ అధికారికంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కోసం జాతీయ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించింది. పారదర్శకత, స్థిరత్వం, పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో మొదలుపెట్టింది. విమానయాన శిక్షణ విభాగంలో ప్రామాణీకరణ, భద్రత, జవాబుదారీ తనాన్ని నిర్ధారించడం దీని లక్ష్యం.